Maatamanti

Muskmelon Ice Pops-ఖర్బుజా తో పుల్ల ఐస్ తయారు చేయడం ఎలా?

Muskmelon ice pops recipe with step by step instructions.English Version.

వేసవి కాలం వచ్చిందంటే పిల్లలు కూల్ డ్రింక్ లు, ఐస్ క్రీంలు లాంటి చల్లని పదార్ధాలు కావాలని మారం చేస్తుంటారు.కానీ అలాంటివి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు.అందుకే పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు ఇస్తుండాలి.ఒకవేళ ఐస్ క్రీం లు లాంటివే కావాలని పట్టుబడితే ఇదిగోండి ఎంచక్కా ఇలా పళ్ళ రసం తో పుల్ల ఐస్ ఇంట్లోనే తయారు చేసేసి ఇవ్వొచ్చు.రుచి కూడా చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు.అన్నట్లు చిన్న పిల్లలే కాదండీ మనలాంటి పెద్ద పిల్లలు 😉 కూడా శుభ్రంగా లాగించేయొచ్చు.రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.

ఈ పుల్ల ఐస్ ల కోసం నేను పండిన ఖర్బూజా తీసుకొని, తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో అర కప్పు పాలు, అరకప్పు పంచదార కలిపి మిక్సీలో వేసి చిక్కని రాసాన్నితయారు చేసాను.ఆ రసాన్ని పేపర్ కప్స్ లో పోసి రాత్రంతా డీప్ ఫ్రిజ్ లో పెట్టాను.చూసారా అవి చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో!తింటే కూడా అంటే రుచిగా ఉన్నాయి.ఈ తేలికైన పుల్ల ఐస్ recipe ని మీరు కుడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Bellam Paanakam Recipe in Telugu
Onion Murukulu Recipe in Telugu
Strawberry Rava Laddu Recipe in Telugu
Bounty Chocolates Recipe in Telugu
Cake with Parle-G biscuits Recipe in Telugu

Click Here for the English Version of this Recipe.

Muskmelon Ice Pops- ఖర్బూజా పుల్ల ఐస్
Prep Time
15 mins
 
Course: Dessert
Cuisine: Global
Servings: 7
Author: bindu
Ingredients
  • 500 గ్రాములు పండిన మస్క్ మెలన్ లేదా ఖర్బూజా ముక్కలు
  • ½ కప్పు పంచదార
  • ½ కప్పు కాచి చల్లార్చిన పాలు
  • ¼ కప్పు దానిమ్మ గింజలు
Instructions
  1. పండిన ఖర్బూజా పండు పైన తోలు తీసేసి చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  2. జ్యూసర్ జార్ తీసుకొని ఈ ముక్కల్ని అందులో వేసి, అర కప్పు పంచదార, అర కప్పు పాలు పోసి చక్కగా స్మూత్ గా అయ్యే వరకు బ్లెండ్ చేయాలి.
  3. పేపర్ కప్స్ ని గానీ, పుల్ల ఐస్ మౌల్డ్స్ ని గానీ తీసుకొని వాటిలో అడుగున కొన్ని దానిమ్మ గింజలు వేయాలి.
  4. తరవాత వాటిల్లో చిక్కని ఖర్బూజా రసాన్ని పోయాలి.
  5. పేపర్ కప్స్ ని అల్యూమినియం ఫాయిల్ తో గానీ, చిన్న ప్లాస్టిక్ పేపర్ తో గానీ కవర్ చేసి, ఆ వ్రాప్ గుండా టూత్ పిక్ ని గానీ ఐస్ క్రీం పుల్లని గానీ గుచ్చాలి.
  6. తర్వాత పుల్ల ఐస్ మౌల్డ్స్ ని ఫ్రీజర్ లో 8 నుండి 10 గంటల వరకు లేదా రాత్రంతా ఉంచాలి.
  7. తర్వాత రోజు వాటిని బయటకు తీసి ఒక నిమిషం పాటు నీళ్ళ లో ఉంచి బయటకు తీయాలి.

Muskmelon Ice Pops recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=hQeCxFgL9l4[/embedyt]

 

Related Post

Please Share this post if you like