Nalla Senaga Guggillu Telugu Recipe with step by step instructions.English Version.
సెనగ గుగ్గిళ్ళు చాలా సులువుగా తయారు చేసుకోగలిగిన తేలికపాటి ఉపాహారం.సాధారణంగా వ్రతం ఆచిరంచే సమయంలో ఈ గుగ్గిళ్ళను ముందు దేవునికి నైవేద్యం గా సమర్పించి తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తుంటారు.ఉపవాసంతో క్షీణించిన శరీరానికి తక్షణ శక్తినిస్తుంది.ఒక్క ఉపవాస సమయాలలోనే కాకుండా వీటిని పిల్లలకు స్నాక్స్ టైం లో చేసి ఇవ్వవచ్చు.పిల్లలు ఏ మాత్రం పేచి పెట్టకుండా చక్కగా ఆడుతూ పాడుతూ వీటిని లాగించేస్తారు.వీటిలో పొటాషియం, ప్రోటీన్స్ అధికంగా ఉండుట వల్ల శరీరానికి కావాల్సిన కొన్ని అత్యవసర పోషకాలు అందుతాయి.
ఒకవేళ వయసులో కొద్దిగా పెద్దవారు వీటిని తినాలనుకుంటే, తాలింపు వేసేప్పుడు కాసింత ఇంగువ వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది.వీటిలోని పొటాషియం కండర మరియు ఎముకల పుష్టికి, డైటరీ ఫైబర్ ప్రేగులో సాధారణ కదలిక కొరకు, బ్లడ్ ప్రెషర్ ను నార్మల్ గా ఉంచుటకు తోడ్పడతాయి.కాబట్టి ఎప్పుడూ స్నాక్స్ అంటే పునుగులు, మిర్చి బజ్జీ లాంటివే కాకుండా ఇలాంటి ఆరోగ్యకరమైనవి తీసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి.మీరు కూడా ఈ recipe ని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Sorakaya Halwa Telugu Recipe
Banana Balls Telugu Recipe
Onion Murukulu Telugu Recipe
Bellam Panakam Telugu Recipe
Strawberry Rava Laddu Telugu Recipe
Saggubiyyam Punugulu Telugu Recipe
Click Here for the English Version of the Recipe
- ½ కప్పు నల్ల సెనగలు
- 750 ml నీళ్ళు సుమారుగా
- ఉప్పు తగినంత
- 1 tbsp నూనె
- ½ tsp ఆవాలు
- ½ tsp జీలకర్ర
- 1 ఎండు మిరపకాయ
- 1 రెమ్మ కరివేపాకు
- ¼ tsp పసుపు
- ½ tsp కారం
- 1 tbsp అల్లం తరుగు
- 2 tbsp కొబ్బరి తురుము
- 2 కాడలు కొత్తిమీర
- 1 పచ్చిమిర్చి తరుగు
-
నల్ల సెనగలను రాత్రంతా నానబెట్టాలి.
-
పొద్దున్నే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్ లోకి తీసుకోవాలి.
-
కుక్కర్లో పప్పు మునిగే వరకు నీళ్ళు పోయాలి.
-
నీళ్ళు ఉప్పగా అనిపించేంత ఉప్పు వేయాలి.
-
కుక్కర్ మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-
ఒక పెనంలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
-
ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
-
అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, పసుపు, కారం, కొబ్బరి తురుము వేసి కలిపి ఓ నిమిషం పాటు తిప్పాలి.
-
కొత్తిమీర తరుగు వేసి స్టవ్ కట్టేసుకోవాలి.
Nalla Senaga Guggillu Telugu Recipe Video Recipe
[embedyt] https://www.youtube.com/watch?v=fClN3JqLArE[/embedyt]