Maatamanti

Nellore Chepala Pulusu recipe in Telugu – నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం

Nellore Chepala Pulusu recipe with step by step instructions.English Version.

నేను చేపల పులుసు తరచుగా చేస్తుంటాను కానీ ఈ నెల్లూరు చేపల పులుసు పేరు వినడమే కానీ ఎప్పుడూ చేయలేదు.నెల్లూరు  చేపల పులుసులో పచ్చి మామిడికాయలు వేసి చేస్తారని ఈ మధ్యే నాకు తెలిసిన వారి ద్వారా తెలుసుకున్నాను.తెలుసుకున్న వెంటనే ఈ కూర చేయాలనుకున్నాను.చేశాను చాలా బాగా కుదిరింది.

ఈ కూర కోసం మీకు నచ్చిన ఏ రకం చేపలైనా ఉపయోగించవచ్చు.కానీ మామిడికాయ మాత్రం పచ్చిగా పుల్లగా ఉండేటట్లు చూసుకోవాలి.మామూలు చేపల కూర కోసం మనం సుమారుగా ఒక 50 గ్రాములు చింతపండు తీసుకుంటే, ఈ కూరకి ఒక 30 గ్రాములు చింతపండు తీసుకుంటే సరిపోతుంది.మిగిలిన పులుపు మామిడికాయ నుంచి వస్తుంది.పులుసు కోసం నీళ్ళు తీసుకోవాలి కదా!అందుకు చేప ముక్కల బరువుకు సమానమైన పరిమాణంలో నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది.నేను 700 గ్రాముల ముక్కలు తీసుకున్నాను అందుకే 700 ml ల నీళ్ళు తీసుకున్నాను.అందులో 200 ml నీళ్ళను చింతపండును నానబెట్టడానికి తీసుకున్నాను.తర్వాత ఆ చింతపండు పులుసును కూరలో వేశాను.మిగిలిన 500 ml నీళ్ళు కూడా తర్వాత కూరలో పోశాను.

ఈ కూరలో గరం మసాలా లాంటివి వేయనవసరం లేదు.కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలను దోరగా వేయించి పొడి చేసి ఆ పొడిని పులుసులో వేస్తే సరిపోతుంది.పులుసుకు చాలా చక్కని రుచి వస్తుంది.నేను ఈ కూర వండడం కోసం మట్టి పాత్ర వాడాను.కానీ మీరు వీలుకాకపోతే మామూలు పాత్రలోనైనా వండుకోవచ్చు.ఒకసారి కూరలో చేప ముక్కలు వేసేశాక ఇంక గరిటె ఉపయోగించకూడదు.అలా చేస్తే ముక్కలు విరిగిపోతాయి.ఒకవేళ కలపాలనుకుంటే గిన్నెను పట్టుకొని జాగ్రత్తగా గుండ్రంగా తిప్పాలి.

చేపల పులుసు వండిన వెంటనే కాకుండా రెండో పూట తింటే చాలా బాగుంటుంది.అందుకే కూర వండాక కదిలించకుండా అలానే వదిలేసి సాయంత్రం వడ్డించాలి.అసలైతే నేను ఈ కూరను బోన్ లెస్ చేపతో చేద్దామనుకున్నాను.కానీ మా అమ్మాయి “అమ్మా!ఎంతైనా మామూలు చేపలో ఉండే టేస్ట్ బోన్ లెస్ ఫిష్ లో ఉండదు.చేపంటే ముళ్ళు తీసుకొనే తినాలి, అప్పుడే రుచి.తేలిగ్గా తినేస్తే ఏమీ బాగోదు.” అంది.”అబ్బో నీకన్నీ బాగానే తెలుసే” అన్నాను.అది చెప్పింది కూడా నిజమే కదండీ.పులుసు మాత్రం మామూలు చేపతో చేస్తేనే బాగుంటుంది.ఏమంటారు?ఎంతో రుచికరమైన ఈ నెల్లూరు చేపల పులుసును మీరు కుడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Karivepaku Chicken Curry Recipe in Telugu
Schezwan Chicken Thighs Recipe in Telugu
Mamidikaya Chicken Fry in Telugu
Fish Biryani Recipe in Telugu
Andhra Chicken Fry Recipe in Telugu
Natu kodi Pulusu Recipe in Telugu

Click here for the English version of this recipe.

5 from 2 votes
నెల్లూరు చేపల పులుసు-Nellore Chepala Pulusu Recipe
Ingredients
చేపలను మారినేట్ చేయుట కొరకు
  • 700 గ్రాములు చేప ముక్కలు
  • 1 tbsp ఉప్పు
  • 1 tsp పసుపు
  • 3 tsp కారం
  • 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1 tsp ధనియాల పొడి
చింతపండు రసం కొరకు
  • 30 గ్రాములు చింతపండు
  • 200 ml నీళ్ళు
మసాలా కొరకు
  • ¼ tsp మెంతులు
  • ½ జీలకర్ర
  • ½ ఆవాలు
కావాల్సిన కూరగాయలు
  • 1 పచ్చి మామిడికాయ పుల్లనిది
  • 2 మీడియం ఉల్లిపాయలు
  • 3 పచ్చిమిరపకాయలు
  • 2 రెమ్మలు కరివేపాకు
  • 1 మీడియం టమాటో
కూర కొరకు
  • ½ tsp పసుపు
  • 2 tsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • ¼ కప్పు ఉల్లి కాడ తరుగు
  • ¼ కప్పు కొత్తిమీర
  • 1/3 కప్పు నూనె
Instructions
చింతపండు నానబెట్టుట.
  1. ఒక గిన్నెలో 30 లేదా 35 గ్రాముల చింతపండు తీసుకొని అందులో 200 ml నీళ్ళు పోసి ఒక పావుగంట పాటు నానబెట్టాలి.
చేప ముక్కలను మారినేట్ చేయుట.
  1. శుభ్రంగా కడిగిన చేప ముక్కలలో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలిపి పావుగంట నానబెట్టాలి.
కూరగాయలను తరుగుట.
  1. మామిడి కాయను శుభ్రంగా కడిగి అంగుళం వెడల్పు క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి.
  2. ఉల్లిపాయ, టమాటాలను తరిగి పక్కన పెట్టుకోవాలి.పచ్చిమిర్చిని నిలువు చీలికలుగా కట్ చేసుకోవాలి.
మసాలా తయారీ.
  1. ఒక చిన్న పెనంలో మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి చక్కని సువాసన వచ్చే వరకు వేపి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
చేపల కూర తయారీ.
  1. చేపల చెట్టి లో నూనె పోసి అది కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తబడే వరకు వేయించాలి.
  2. అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  3. పసుపు, కారం, ధనియాల పొడి, మెంతులు&జీలకర్ర&ఆవాలు పొడి వేసి కలపాలి.
  4. మామిడికాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి.
  5. మూత తెరచి, చింతపండు పులుసు వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించాలి.
  6. అందులో 500 ml నీళ్ళు పోసి మరిగే వరకు ఉడికించాలి.
  7. పులుసు మరగడం మొదలవ గానే అందులో చేప ముక్కలు వేసి 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
  8. ఉల్లికాడ తరుగు, కొత్తిమీర వేసి పొయ్యి కట్టేయాలి.

Nellore Chepala Pulusu Recipe Video

Related Post

Please Share this post if you like