Paanakam Recipe with step by step instructions.English Version.
బెల్లం పానకం చాలా ఆరోగ్యకరమైన వేసవి పానీయం.కూల్ డ్రింక్ లు అవీ ఇవీ తాగే బదులు చక్కగా పానకం గానీ, మజ్జిగ గానీ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే కావాల్సినపుడల్లా తీసుకొని ఎంచక్కా తాగేయొచ్చు .రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.పానకాన్ని సాధారణంగా శ్రీరామ నవమి రోజున వడపప్పు తో పాటు నైవేద్యంగా సమర్పించి తరువాత తీసుకుంటారు.కానీ దీన్ని నవమి రోజునే చేసుకొని తాగాలని కాదు ఎప్పుడైనా చేసుకొని తాగినా మంచిదే.పానకానికి శరీర ఉష్ణోగ్రతను సంతులనం చేసే శక్తి ఉంది.
నా చిన్నప్పుడు నవమి రోజున పానకాన్ని మా నాన్న తయారు చేసేవారు.అది ఎంతో రుచిగా ఉండేది.ఆయనకి ఆమ్లెట్, పానకం చేయడం మాత్రమే వచ్చు.కానీ రెండూ బాగా చేసేవారు.పానకంలో ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే బాగుంటుంది.నాలుగు తులసి ఆకులు గానీ, పుదినా ఆకులు గానీ వేసుకుంటే మరీ మంచిది.అదే పానకంలో ఇంకా కొంచెం బెల్లం ఎక్కువ వేసి కుల్ఫీ మౌల్ద్ లో పోసి ఫ్రిజ్ లో గడ్డ కట్టేవరకు ఉంచి పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు.కృత్రిమ రంగులు, ఫ్లేవర్స్ వేసిన ఐస్ లు కొనివ్వడం కన్నా ఇలా చేస్తే మంచిది.మీరు కూడా ఈ పానకాన్ని తయారు చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Ulavacharu Recipe in Telugu
Andhra Mango Pickle in Telugu
Pandumirapakaya pachadi in Telugu
Chamagadda Pulusu in Telugu
Onion Murukulu in Telugu
Click here for the English version of the Recipe.
- 150 గ్రాములు బెల్లం
- 1 లీటరు నీళ్ళు
- 1 tsp యాలుకల పొడి
- 1 tsp మిరియాల పొడి
- ½ tsp శొంఠి పొడి
- ½ సోంపు పొడి
- 1 నిమ్మకాయ
- 10 ఐస్ క్యూబ్స్
-
ఒక గిన్నెలో తురిమిన బెల్లం తీసుకోవాలి.
-
అందులో నీళ్ళు పోసి కరిగేవరకు కలపాలి.
-
తర్వాత యాలుకల పొడి, మిరియాల పొడి, శొంఠి పొడి, సోంపు పొడి, నిమ్మ రసం వేసి కలపాలి.
-
కలిపిన నీటిని వేరే గిన్నెలోకి వడకట్టాలి.
-
ఫ్రిజ్ లో కాసేపు ఉంచి చల్లబడ్డాక తాగితే చాలా రుచిగా ఉంటుంది లేదా ఐస్ ముక్కలు వేసి అప్పటికప్పుడు తాగవచ్చు.
Paanakam Recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=m-1oJn4n_Ts[/embedyt]