Palli Karam Dosa Telugu Recipe with step by step instructions.English Version.
ఒకప్పుడు దోశ అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మాత్రమే తినేవారు.కానీ ఇప్పుడు సాయంత్రం అయితే చాలు దోసె స్టాల్స్ దగ్గర జనాలు గుంపులు కడుతున్నారు.మేము బయట దోసెల బండి దగ్గర తినడం చాలా అరుదు.కానీ ఈ మధ్య ఓ రోజు ఇంట్లో రాత్రి వంట చేయడానికి టైం దొరక లేదు.కనీసం online లో ఆర్డర్ చేసి కూడా తెప్పించుకోలేనంత పని ఉండి మర్చిపోయాను.మా హస్బెండ్ ఇంటికి వచ్చి నేను ఏమి వండలేదని తెలుసుకొని బయటకు వెళ్లి తిన్దామన్నారు.ఎప్పుడూ రెస్టారెంట్ ఎందుకు ఈసారి స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం అన్నాను.రాత్రి 11.30 గంటలకు వెళ్తే వరసగా km పొడవున దోసె స్టాల్స్, మోమోస్, shawarma, ఇంకా చాలా రకాలు ఉన్నాయి.జనాలు విపరీతంగా ఉన్నారు.అది పగలో రాత్రో అర్ధం కాలేదు.
మేము అక్కడ ఒక దోసె స్టాల్ లో ఛీజ్ దోసె, ఇంకా పల్లీ కారం దోసె ఆర్డర్ చేశాము.టేస్ట్ చాలా చాలా బాగున్నాయి.పల్లీ కారం దోసె తినగానే బాగా నచ్చి ఈ recipe చేసి పోస్ట్ చేశాను.చాలా బాగా కుదిరింది.మా అమ్మాయి ఇంకా హస్బెండ్ ఇష్టంగా తిన్నారు.ఈ దోసెకు రుచి అంతా పల్లీ కారం తోనే వస్తుంది.అందుకే అది బాగా చెయ్యాలి.మీకు ఇష్టమైతే ఛీజ్ కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు. ఒక దోసె తింటే సరిపోతుంది.ఈ దోసె ని టమాటో చట్నీ తో వేడిగా వడ్డిస్తే సూపర్ గా ఉంటుంది.మీరు కూడా ఈ పల్లీ కారం పొడి దోసె ను ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Sprouted Moong Dal Dosa Telugu Recipe
Ulli Karam Dosa Telugu Recipe
Bread Pizza Recipe in Telugu
Instant Rava Vada Recipe in Telugu
Leftover bread Pancake Recipe in Telugu
Click here for the English version of the Recipe.
- ½ కప్పు పల్లీలు వేయించినవి
- 5 to 6 ఎండు మిరపకాయలు
- 10 గ్రాములు చింతపండు
- 4 to 5 వెల్లుల్లి రెబ్బలు
- 1 tsp జీలకర్ర
- 1 tsp ధనియాలు
- ఉప్పు తగినంత
- 2 to 3 tsp నూనె
- దోశ పిండి తగినంత
- 30 to 50 గ్రాములు ఛీజ్
- నెయ్యి తగినంత
- ½ కప్పు కొత్తిమీర తరుగు
- ఒక పెనంలో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ధనియాలు, ఎండు మిరపకాయలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
- తర్వాత చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన పల్లీలు కూడా వేసి మరో నిమిషం పాటు వేయించాలి.
- స్టవ్ కట్టేసి కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీలోకి తీసుకుని సరిపడినంత ఉప్పు వేసి మెత్తగా పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి.
- పెనం వేడి చేసి అందులో రెండు గరిటెల దోశ పిండి వేసి పెనం అంచుల దాకా వచ్చేలా గుండ్రంగా తిప్పాలి.
- 10 నుండి 15 సెకెన్ల పాటు అలా ఉంచి, పైన పల్లీ కారం పొడి వేయాలి.
- దోశ చుట్టూ నెయ్యి వేసి పైన ఛీజ్ తురుము ఇంకా కొత్తిమీర కూడా వేసి ఛీజ్ కరిగే వరకు లేదా దోశ చక్కగా రోస్ట్ అయ్యే వరకు వేయించాలి.
Palli Karam Dosa Telugu Recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=EYYWHkvyIxg[/embedyt]
Leave a Reply