Pandu Mirapakaya Pachadi Recipe Andhra style with step by step instructions.English Version
ఇది నాకు అన్నింటి కన్నా చాలా ఇష్టమైన పచ్చడి.మామిడికాయ పచ్చడి కన్నా కూడా ఇష్టం.ఎందుకంటే ఈ పచ్చడితో నాకు కొన్ని మధురమైన జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి.పచ్చడితో జ్ఞాపకాలేంటి?పిచ్చిది అనుకుంటున్నారా?నా చిన్నప్పుడు మా పెద్ద అత్త(మా పెద్ద మామయ్య భార్య) రోజు సాయంత్రం అప్పుడే వార్చిన వేడి వేడి అన్నంలో ఇంట్లోనే తయారు చేసిన వెన్న వేసి పండుమిరపకాయ పచ్చడి తో కలిపి ముద్దలు పెట్టేది.నిజంగా ఆ రుచికి ఏది సాటి రాదు.చేప్తుంటేనే నోరూరిపోతుంది కదూ.
మా అమ్మమ్మగారింటి ముందు రోజూ సాయంత్రం నేలంతా తడిపేవారు.అక్కడ పచ్చిక మీద పిల్లలందరికీ నవారు మంచాలు వరుసగా వేసేవారు.మేము అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే మా అత్త అన్నం కలుపుకొచ్చి వేడి వేడి ముద్దలు తినిపించేది.సాయంత్రం పూట గూటికి చేరుకునే పక్షుల అరుపులు వింటూ, అందమైన ప్రశాంతమైన సంధ్యా సమయాన్ని ఆస్వాదిస్తూ, కమ్మని ముద్దలు తింటుంటే ఆ ఆనందం అనిర్వచినీయమైనది.ఆ రోజులు మళ్ళీ రావు.
రెండు సంవత్సరాల క్రితం వరకు నాకు అన్ని పచ్చళ్ళు మా పిన్ని విజయవాడ నుండి పంపేది.కానీ నేను కూడా చేయడం నేర్చుకోవాలి కదండీ అందుకే ఇక మా పిన్నిని ఇక కష్టపడి చేయవద్దని చెప్పాను.అప్పటినుండి నేనే అన్ని పచ్చళ్ళు తయారు చేసుకుంటున్నాను.
పచ్చిమిరపకాయలు సాధారణంగా సంవత్సరమంతా పండుతాయి.ఎండు మిర్చి కోసం వేసే విత్తనాలే వేరుగా ఉంటాయి.ఆ విత్తనాలను కేవలం ఎండు మిర్చి తయారీ కొరకే వేస్తారు.మిర్చి రైతులు చలికాలం చివర్లో కాయలు కోయకుండా చెట్టు మీదే పండేదాకా వదిలేస్తారు.పండిన కాయల్ని కోసి ఎండబెడతారు.అప్పుడు ఎండు మిర్చి తయారవుతుంది.అప్పుడే కొన్ని పండుమిరపకాయలను రైతులు మార్కెట్లో అమ్ముతారు.వీటితో పచ్చడి చేస్తుంటారు.పండుమిరపకాయ పచ్చడి పెట్టడానికి అదే అనువైన కాలం.మామిడికాయ పచ్చడి కొత్తల్లో బాగుంటుంది.కానీ పండుమిరపకాయ పచ్చడి పాతబడినకొద్దీ బాగుంటుంది.
పచ్చట్లో ఎంత చింతపండు వేయాలన్నది మిర్చి రకం మీద ఆధారపడి ఉంటుంది.సన్న మిర్చీలు ఎక్కువ కారంగా ఉంటాయి.సాధారణంగా ఎక్కవ సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా మధ్యస్తంగా ఉన్న మిరపకాయలతో పచ్చడి పెడతారు.పచ్చడి తయారు చేసాక తాలింపు కూడా మొత్తం ఒకసారే పెట్టరు.కావల్సినపుడల్లా జాడీలో నుండి కొంత పచ్చడి తీసుకొని పోపు పెడతారు.
వేడి అన్నంలో వెన్న గానీ, నెయ్యి గానీ, మీగడ గానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది.మీరు కూడా ఈ రుచికరమైన పచ్చడిని తయారు చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Munakkada Tomato Curry in Telugu
Cauliflower pachadi in Telugu
Mushroom Aloo Khurma in Telugu
Potato fry in Telugu
Ulavacharu Recipe in Telugu
Mamidi Allam Pachadi Recipe in Telugu
Click here for the English version of this recipe.
మరిన్ని తెలుగు recipe videos కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 500 గ్రాములు పండుమిరపకాయలు
- 150 గ్రాములు చింతపండు
- ఉప్పు రుచికి సరిపడినంత
- 1 tbsp పసుపు
- 1 tsp వేయించిన మెంతులు
- 50 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు
- ½ tsp ఆవాలు
- ½ tsp జీలకర్ర
- 1 tsp పచ్చిశనగపప్పు
- 1 tsp మినపపప్పు
- 1 రెమ్మ కరివేపాకు
- 4 tsp నూనె
ముందుగా మిర్చిలను శుభ్రంగా కడిగి పొడి బట్టతో తడి లేకుండా తుడవాలి.
తర్వాత 15 నుండి 20 నిమిషాల పాటు ఎండలో పెట్టాలి.ఎండ లేకపోతే సీలింగ్ ఫ్యాన్ కింద అయినా పెట్టి ఆరనివ్వాలి.
ఆరాక తొడిమలు ఒలిచి పక్కన పెట్టుకోవాలి.
కొత్త చింతపండు తీసుకొని, అందులో గింజలు, పెంకులు, పీచు లాంటివి లేకుండా శుభ్రం చేయాలి.
తర్వాత దానిని ఒక పొడిగా ఉన్న డబ్బాలో పెట్టాలి(స్టీలు డబ్బా వాడకూడదు).
మిరపకాయలను చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో ఉప్పు, పసుపులతో పాటు వేసి కచ్చా పచ్చాగా నూరుకోవాలి(మెత్తగా రుబ్బకూడదు).
ఆ రుబ్బిన మిశ్రమాన్ని చింతపండు మీద ఉంచి, డబ్బా మూత పెట్టి 2 నుండి 3 రోజుల పాటు నాననివ్వాలి.
paపచ్చి మిర్చి గుజ్జులోని తడి వల్ల కింద ఉన్న చింతపండు నానుతుంది.
మూడు రోజుల తర్వాత మూత తెరిచి, పైన ఉన్న మిర్చి గుజ్జు తీసి పక్కన పెట్టేసి, చింతపండును, వెల్లుల్లి రెబ్బలను తీసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
అందులో పక్కన ఉంచుకున్న మిర్చి గుజ్జును, మెంతి పిండిని, అవసరమైతే కొద్దిగా ఉప్పును వేసి ఒక 2 నుండి 3 సెకన్ల పాటు మిక్సీ తిప్పాలి.
తయారైన పచ్చడిని జాడీ లో ఉంచి భద్రపరచుకోవాలి.కావాల్సినప్పుడల్లా కొద్దిగా తీసుకొని తాలింపు పెట్టుకోవాలి.
ఒక చిన్న పెనంలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగలు, మిమునులు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి చిటపటలాదేవరకు వేయించి పచ్చట్లో వేసి బాగా కలపాలి.
Pandu Mirapakaya Pachadi Recipe Video
Aswini says
Arakilo pachadi ki 1tsp salt saripothunda antena
BINDU says
HI, Aswini 1 tsp salt asalu saripodu ventane booju pattestundi.so atleast 1/4 cup to 1/3 cup salt add cheyaalsi untundi.ee pickle ki ayina salt ee kadandi main preservative.