Perugu Vada Telugu Recipe with step by step instructions.English Version.
నేను ఎప్పుడు వడలు చేసినా పెరుగు వడల కోసం కొన్ని ఉంచుతాను. పెరుగు వడలనే ఆవడలు అని కూడా అంటారు. వీటిని ఆంధ్రా ప్రాంతంలో ఎక్కువగా తయారు చేస్తుంటారు. ఇంట్లో అయితే మనం గారెలు చేసుకున్నప్పుడు మాత్రమే పెరుగు వడలు తయారు చేస్తుంటాము. కానీ మనకు ఎప్పుడు తినాలనిపించినా అన్ని టిఫిన్ హోటల్స్ సులువుగా దొరుకుతాయి.
నార్త్ సైడ్ వీటినే దహీ వడ అంటారు. కానీ వారు చేసే విధానం వేరుగా ఉంటుంది. మనం పెరుగు వడలని బ్రేక్ ఫాస్ట్ లో తింటే వారు ఛాట్ ఐటమ్ గా తింటుంటారు. మనం వడలను ఫ్లాట్ గా చేస్తే వారు గుండ్రంగా పునుగుల్లా చేస్తారు. వాటిని పెరుగులో వేసి నానబెట్టి పైన మీఠా, హరా చట్నీ, బారిక్ సేవ్(సన్న కారప్పూస), కొత్తిమీర వేసి సర్వ్ చేస్తారు. మేము ముంబై లో ఉన్నప్పుడు చార్కొప్ లో ఉండే భగవతి రెస్టారెంట్ లో ఈ దహీ వడ తినే వాళ్ళం .అవి కూడా చాలా బాగుంటాయి.
పెరుగు వడలు బాగా రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. తాలింపు చేయడం అవ్వగానే పెరుగు లో వేయకుండా ఒక్క నిమిషం ఆగి వేయాలి. ఇలా చేయడం వల్ల పెరుగు విరిగి పోయినట్లు గా అవదు.ఈ రెసిపీ కోసం తాజా గా ఉన్న తియ్యని పెరుగు తీసుకుంటే మంచిది. ఎందుకంటే గారెల్ని ౩ నుండి 4 గంటలు నానబెట్టేసరికి పెరుగు కాస్త పుల్లగా మారుతుంది.ఆ పులుపు బాగుంటుంది.ముందే పుల్లని పెరుగు లో వేశామనుకోండి అవి నానే సరికి పెరుగు ఇంకా పుల్లగా అయిపోయి రుచి బాగోదు.
ఒక వేళ పెరుగు వడలు మిగిలితే ఆలస్యం చేయకుండా వెంటనే ఫ్రిజ్ లో పెట్టేస్తే మరుసటి రోజు కూడా తిన వచ్చు. ఫ్రిజ్ లో పెట్టడం లేట్ అయితే బాగా పులిసిపోయి తినడానికి పనికి రాకుండా పోతాయి.ఈ కమ్మని పెరుగు వడలని మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Mirchi Bajji Telugu Recipe
Semiya Bonda Telugu Recipe
Chicken Dosa Recipe in Telugu
Beetroot Poori Recipe in Telugu
Andhra Hotel style Poori Curry Recipe in Telugu
Palli Karam Dosa Recipe in Telugu
Sprouted Moong Dal Pesarattu Recipe in Telugu
Instant Rava Vada Recipe in Telugu
Saggubiyyam Punugulu Recipe in Telugu
Semiya Bonda Recipe in Telugu
Ulli Karam Dosa Recipe in Telugu
Click here for the English Version of the Recipe
- 4 మినప వడలు
- 1 కప్పు లేదా 250 గ్రాములు గట్టి పెరుగు
- ౩/4 కప్పు నీళ్ళు
- ½ అంగుళం అల్లం ముక్క
- ౩ పచ్చిమిరపకాయలు
- 1 రెమ్మ కరివేపాకు
- ౩ రెమ్మలు కొత్తిమీర
- ½ tsp ఆవాలు
- ½ tsp జీలకర్ర
- ¼ tsp పసుపు
- 1 ఎండు మిరపకాయ
- 1 tbsp నూనె
- చిటికెడు ఇంగువ
-
గట్టి పెరుగులో కొద్దిగా నీళ్ళు పోసి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా లేకుండా పెరుగును బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి.
-
చిన్న కడాయి నూనె వేసి వేడి చేయాలి.
-
నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
-
అల్లం తరుగు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి కొద్ది సెకన్లు వేయించాల్లి.
-
స్టవ్ కట్టేసి తాలింపు ను ఒక రెండు నిమిషాలు చల్లార నివ్వాలి.
-
తర్వాత పెరుగు లో వేసి బాగా కలపాలి.
-
ముందుగా చేసి పెట్టుకున్న మినప వడలను పెరుగు లో వేసి మునిగేలా నొక్కాలి.
-
పైన కొత్తిమీర తరుగు చల్లి ౩ నుండి 4 గంటల పాటు నాననివ్వాలి.