Pudina Dahi Chutney Telugu Recipe with step by step instructions.English Version.
ఈ పుదీనా చట్నీ చాలా రుచిగా ఉంటుంది.తందూరీ, కబాబ్ వంటి వంటకాలకు నంజుకునేందుకు డిప్ గా వాడుతుంటారు.అంతే కాకుండా సమోసా, కచోరి, శాండ్ విచ్ వంటి స్నాక్ ఐటమ్ లతో కూడా కలిపి తింటుంటారు.ఇది రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.ఈ పచ్చడిని ఎటువంటి నూనె ఉపయోగించకుండా వండకుండా తయారు చేస్తారు.
కొన్ని రెస్టారెంట్ లలో చట్నీ ఆకర్షణీయంగా కనిపించడానికి రంగు మరీ ఎక్కువగా వేసేస్తారు.ఒక్కోసారి బాగా పులిసిన పెరుగు వాడుతుంటారు.ఇది ఎక్కువగా summer లో జరుగుతుంది.వాళ్లెప్పుడో పొద్దున్న చేసి పెట్టేసుకుంటారు.అదేమో వేడికి పులిసి పోయి చట్నీ రుచి మారిపోతుంది.నాకు ఎంత ఇష్టమైనా అలా పులిసిన గ్రీన్ చట్నీ మాత్రం తినలేను.అలాంటప్పుడు గార్లిక్ సాస్ తో తింటుంటాను.నాకు అన్నింటికన్నా గార్లిక్ సాస్ అంటే చాలా ఇష్టం.అసలు ఆ డిప్ కోసమే నేను చికెన్ రేష్మి కబాబ్ తింటుంటాను.
మనం దేనితో అయితే దీన్ని నంజుకుని తింటామో ఆ పదార్ధాన్ని సులువుగా జీర్ణం అయ్యేలా ఈ చట్నీ చేస్తుంది.నంజుకోవడానికి అయితే పలుచగానూ, శాండ్ విచ్ వంటి వాటిలో వేయడానికైతే పెరుగు లేకుండా కాస్త నిమ్మ రసం పిండి తయారు చేసుకోవాలి.కాస్త పచ్చి కొబ్బరి వేసి రుబ్బినా బాగానే ఉంటుంది.కొత్తిమీర వేయకపోయినా పర్వాలేదు.నేను ఫోటో బాగా రావాలని గ్రీన్ కలర్ ఉపయోగించాను కానీ అసలు కలర్ వాడకపోవడమే మంచిది.మీరు కూడా ఈ recipe ని తయారు చేసి ఆ కమ్మని రుచిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Dondakaya Chutney Recipe in Telugu
Tomato Pudina Chutney Recipe in Telugu
Mushroom Pickle Recipe in Telugu
Cauliflower Pachadi Recipe in Telugu
Andhra Mamidikaya Pachadi Recipe in Telugu
Pandu Mirapakaya Pachadi Recipe in Telugu
Click here for the English Version of this Recipe.
- 1 కప్పు పుదీనా ఆకులు
- ½ కప్పు కొత్తిమీర
- 1 కప్పు చిలికిన పెరుగు
- 6 జీడి పప్పులు
- 1/4 tsp నల్ల ఉప్పు/బ్లాక్ సాల్ట్
- ఉప్పు తగినంత
- ½ tsp చాట్ మసాలా
- చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్
- మిక్సీలో పుదీనా ఆకులు, కొత్తిమీర, జీడి పప్పు, పచ్చిమిరపకాయలు, నల్ల ఉప్పు, చాట్ మసాలా, ఉప్పు వేసి నీళ్ళు పోయకుండా రుబ్బాలి.
- జార్ మూత తీసి పెరుగు, గ్రీన్ ఫుడ్ కలర్ వేసి మళ్ళీ మెత్తగా మృదువుగా అయ్యే వరకు రుబ్బాలి.
Pudina Dahi Chutney Telugu Recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=mdT1IUJbnZs[/embedyt]
Leave a Reply