Maatamanti

Rava Cake Telugu Recipe-బొంబాయి రవ్వ తో కేక్ తయారీ

Rava Cake Telugu recipe with step by step instructions.English Version.

పిల్లల నుండి పెద్దవాళ్ళ దాక కేక్ అంటే ఇష్టపడని వారుండరు. కేక్ చేయడం పెద్ద కష్టం కూడా కాదు. చాలా మంది కేక్ మిక్సర్స్, ఓవెన్ ఇలాంటివి ఉంటేనే కేక్ చేయగలమేమో అనుకుంటుంటారు. కానీ అవేమి లేకుండానే కేక్ ను సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

సాధారణంగా మైదా పిండి తో కేక్ తయారు చేస్తుంటారు.కానీ బొంబాయి రవ్వ తో కూడా కేక్ తయారు చేయవచ్చు.ఈ కేక్ చాలా సులువుగా తేలికగా ఓవెన్ లేకుండానే తయారు చేయొచ్చు.దీని కోసం సన్న బొంబాయి రవ్వ తీసుకోవాలి. బటర్, పంచదార, రవ్వ వేసి కలిపాక కొద్ది కొద్దిగా పాలు పోస్తూ మిశ్రమం జారుగా అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపు(10 నుండి 15 నిమిషాలు) నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల బొంబాయి రవ్వ తేమని పీల్చుకుంటుంది. అప్పుడు కేక్ మిశ్రమం గట్టిగా అయిపోతుంది.

మళ్ళీ కొద్ది కొద్దిగా పాలు పోస్తూ మిశ్రమం జారుగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా మిశ్రమాన్ని నానబెట్టి రెండు సార్లుగా పాలు పోయక పొతే కేక్ త్వరగా మాడి పోవడమే కాకుండా రవ్వ రవ్వగా తగులుతూ గట్టిగా ఉంటుంది.ఈ కేక్ లో మీకు నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు.నాకు వెనిల్లా ఎసెన్స్ ఫ్లేవర్ అంటే ఇష్టం ఉండదు. అందుకే ఏలకుల పొడి వేశాను. లెమన్ ఫ్లేవర్ కోసం లెమన్ జెస్ట్(నిమ్మకాయ పైన పొట్టు) లేదా ఆరంజ్ ఫ్లేవర్ కోసం ఆరెంజ్ జెస్ట్ వేసుకోవచ్చు.ఆర్టిఫిషియల్ కన్నా సహజమైన ఫ్లేవర్స్ బాగుంటాయి.

ఇదే కేక్ ని మీరు ఓవెన్ లో కూడా తయారు చేసుకోవచ్చు. ఓవెన్ ను 180 డిగ్రీల వద్ద ప్రీ హీట్ చేసి 25 నుండి 30 నిమిషాల వరకు బేక్ చేయాలి.15 నిమిషాల తర్వాత నుండి ప్రతీ 5 నిమిషాల కొకసారి చూసుకుంటే మంచిది. కేక్ పూర్తిగా బేక్ అయ్యాక వెంటనే కేక్ టిన్ నుండి వేరు చేయకుండా పూర్తిగా చల్లబడే వరకు ఆగి తర్వాత తీయాలి. రెండు రోజుల వరకు ఈ కేక్ నిల్వ ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ తేలికైన రవ్వ కేక్ ను మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Malai Laddu Recipe in Telugu
Ariselu Recipe in Telugu
Bobbatlu Recipe in Telugu
Dry Fruit Recipe in Telugu
Saggubiyyam Payasam Recipe in Telugu
Poornam Boorelu Recipe in Telugu
Sorakaya Halwa Recipe in Telugu
Banana Balls Recipe in Telugu
Flax Seeds/Avise laddu Recipe in Telugu
Homemade Bounty Chocolates Recipe in Telugu
Strawberry Rava Laddu Recipe in Telugu

Click here for the English Version of this Recipe

5 from 1 vote
Rava Cake Telugu Recipe
Prep Time
20 mins
Cook Time
40 mins
Total Time
1 hr
 
Course: Dessert
Cuisine: Global
Author: బిందు
Ingredients
  • 225 గ్రాములు లేదా 1 ¼ కప్పులు బొంబాయి రవ్వ
  • 125 గ్రాములు కరిగించిన బటర్
  • 125 గ్రాములు లేదా 1 కప్పు పంచదార పొడి
  • ¼ కప్పు లేదా 25 గ్రాములు కొబ్బరి పొడి
  • 1 tbsp బేకింగ్ పౌడర్
  • ½ tsp ఏలకుల పొడి
  • 1 కప్పు లేదా 250 ml పాలు
  • చిటికెడు పసుపు రంగు
  • ¼ కప్పు నట్స్ తరుగు
Instructions
  1. ఒక మిక్సింగ్ బౌల్ లో కరిగించిన బటర్, పంచదార పొడి వేసి బాగా కలపాలి.
  2. బేకింగ్ పౌడర్, ఏలకుల పొడి, ఎల్లో కలర్ వేసి కలపాలి.
  3. బొంబాయి రవ్వ వేసి మరోసారి కలపాలి.
  4. కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా పోస్తూ కేక్ మిశ్రమాన్ని జారుగా కలపాలి.
  5. కలిపిన మిశ్రమాన్ని 10 నుండి 15 నిమిషాలు నాననివ్వాలి.
  6. తేమనంతా పీల్చుకుని కేక్ మిశ్రమం గట్టిగా తయారవుతుంది.
  7. మళ్ళీ కొద్ది కొద్దిగా పాలు పోస్తూ జారుగా అయ్యే వరకు కలపాలి.
  8. కేక్ టిన్ కు అతుక్కోకుండా బటర్ రాసి కొద్దిగా మైదా పిండి చల్లాలి.
  9. టిన్ లో కేక్ మిశ్రమాన్ని వేయాలి.పైన నట్స్ తరుగు వేయాలి.
  10. ప్రెషర్ కుకర్ లో ఇసుక కానీ, ఉప్పు కానీ వేసి మూత పెట్టి 5 నిమిషాలు వేడి చేయాలి.
  11. మూత తెరిచి కేక్ టిన్ ను ఇసుక మీద ఉంచి గాస్కెట్ తీసేసి కుకర్ మూత పెట్టాలి.
  12. 35 నుండి 40 నిమిషాలు బేక్ చేయాలి.లేదా టూత్ పిక్ ను కేక్ లో గుచ్చితే కేక్ మిశ్రమం అంటకుండా వచ్చే వరకు బేక్ చేయాలి.
  13. కేక్ ను పూర్తిగా చల్లారనిచ్చి తర్వాత కట్ చేయాలి.

Rava Cake Telugu Recipe Video

Related Post

Please Share this post if you like