Rice flour face mask with step by step instructions.
బియ్యాన్ని భారతదేశం లో మరియు ఆసియా ఖండంలోని కొన్ని ప్రాంతాలలో ప్రధాన ఆహారంగా వాడుతుంటారు.బియ్యం తో కేవలం అన్నమే కాకుండా రకరకాల పిండి వంటలు, స్వీట్లు, వడియాలు తయారు చేస్తూ ఉంటారు.కానీ బియ్యాన్ని కేవలం ఆహారంగానే కాకుండా సౌందర్య పోషణకు కుడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా?
బియ్యంపిండి యొక్క గరుకుదనం వల్ల మృత చర్మ కణాలు తొలగిపోతాయి.చర్మంపై గల స్వేద రంధ్రాలలోని మురికిని మరియు క్రిములను తొలగించి మొటిమలు రాకుండా నివారిస్తుంది.
ఈ మాస్క్ తయారీకి మీకు కావాల్సిన పదార్ధాలు
పొడి చర్మం గల వారికి
బియ్యం పిండి – 2 tbsp
పెరుగు – 1 1/2 tbsp
నిమ్మ రసం – 1 tbsp
తేనె – 1 tbsp
జిడ్డు చర్మం గల వారికి
బియ్యం పిండి – 2 tbsp
రోజ్ వాటర్ – 2 లేదా 3 tbsp
నిమ్మ రసం – 1 tbsp
తేనె – 1 tbsp
పైన చెప్పిన పదార్ధాలన్నింటినీ ఒక బౌల్ లోకి తీసుకొని బాగా కలిపి పేస్ట్ లాగ చేసుకోవాలి.కొద్ది కొద్దిగా తీసుకొని మొహం మీద సర్కులర్ మోషన్ లో తిప్పుతూ రాసుకోవాలి.మెడ మీద చేతుల మీద కూడా రాసుకోవచ్చు.మాస్క్ ఆరాక గట్టిగా అయిపోయి ముఖానికి పట్టేసినట్లు అవుతుంది.అందుకే ఈ మాస్క్ వేసుకున్నప్పుడు నవ్వడం, మాట్లాడడం, తినడం లాంటివి చేయకూడదు.కంటి చుట్టూ ఉండే ప్రదేశం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి అక్కడ అప్లై చేయకూడదు.
మాస్క్ ఎండి పోయే వరకు అలాగే ఉండ నిచ్చి తర్వాత కొద్దిగా కొద్దిగా తడి చేస్తూ మెల్లగా రిమూవ్ చేయాలి.అంతే కానీ గట్టిగా గీరుతూ రిమూవ్ చేయకూడదు.తర్వాత ఒక 4 గంటల వరకు సోప్ ఉపయోగించ కూడదు.మాస్క్ తీయగానే ఆ ప్రదేశంలో చేతితో తాకి చూస్తే స్కిన్ చాలా సున్నితంగా జారిపోతున్నట్లుగా అనిపిస్తుంది.అది అలానే ఉండాలంటే మాస్క్ తీసేయగానే ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
మాస్క్ వేసుకున్న మరుసటి రోజే బాగా ఎండలో కానీ బాగా చలి లోకాని ఎక్కువ సేపు ఉంటే మళ్ళీ ముఖం పాడయిపోతుంది.అందుకే బయటకి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఎండలో ఎక్కువ సేపు ఉండాల్సి వస్తే SPF ఎక్కువగా ఉన్న క్రీమ్ అప్లై చేసుకొని వెళ్ళాలి.ఎండ పడకుండా ముసుగు ధరించాలి.చలిలో వెళ్లాల్సి వస్తే మాయిశ్చరైజర్ రాసుకొని వెళ్ళాలి.వేసవిలో అయితే రెండు గంటలకోసారి ముఖాన్ని సబ్బు పెట్టకుండా ఉట్టి నీళ్లతో కడుక్కోవాలి.
ముఖం మరీ కాంతి హీనంగా అనిపిస్తుంటే ఈ మాస్క్ ను వారానికి కనీసం రెండు సార్లు వేసుకోవాలి.ఈ ప్యాక్ తో పాటు తాజా పళ్ళు తింటూ రోజుకి కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగాలిఇలా చేయడం వల్ల కేవలం రెండు వారాల్లోనే ముఖం మెరుస్తూ కాంతివంతంగా మారుతుంది.
అందమైన మెరిసే గులాబీ పెదవుల కోసం చిట్కాలు
Rice flour face mask Video
Leave a Reply