Schezwan Fried Rice with step by step instructions.English Version.
చక్కటి నోరూరించే చైనీస్ వంటకాలలో షేజ్వాన్ రైస్ కూడా ఒకటి.నిజంగా ఈ వంటకాన్ని చైనీస్ అయినా వండుకుంటారో లేదో తెలీదు కానీ మనవాళ్ళు మాత్రం వీధికో బండి పెట్టి తెగ అమ్మేస్తుంటారు. కొద్దిగా కారంగా ఉన్నా సరే పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు.ఎంతైనా మనం ఇంట్లో తయారు చేసుకున్న దానికన్నా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చేసిందే బాగుంటుందనిపిస్తుంది.ఎందుకంటే చైనీస్ వంటకాలను పెద్ద మంట మీద పెట్టి వండుతారు.అలా చేయడం వల్ల పదార్ధానికి చక్కని పొగ వాసన అంటి మంచి రుచిగా మారుతుంది.మనం ఇంట్లో అంత హై ఫ్లేమ్ మీద వండలేము.ఒకవేళ వండాలనుకున్నా ఎక్కడ గిన్నెలు పాడయిపోతాయో అని ఆలోచించాలి.కానీ బయటకి వెళ్లి తినే అవకాశం లేనప్పుడు ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
ఈ recipe కి షేజ్వాన్ సాస్ అనేది ముఖ్యమైన పదార్ధం.షేజ్వాన్ సాస్ అన్ని సూపర్ మార్కెట్ లలో చాలా తేలికగా దొరుకుతుంది.ఒకవేళ అది మీ దగ్గరలో అందుబాటులో లేకపోయినా, మీరు ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలన్న టైం కి అనుకోకుండా అయిపోయినా మీరే స్వయంగా షేజ్వాన్ సాస్ ని కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
నేను ఈ recipe ని vegetables తో చేశాను.మీరు కావాలంటే కూరగాయలకు బదులుగా గుడ్లు కానీ, ముందే ఉడికించి పెట్టుకున్న బోన్ లెస్ చికెన్ ముక్కలను కానీ వేసి కాసేపు షేజ్వాన్ సాస్ లో ఫ్రై చేసి తర్వాత అన్నం కూడా వేసి కలిపి వండుకోవచ్చు.షేజ్వాన్ సాస్ ని మీ రుచి కి తగ్గ మోతాదులో వేసుకోవాలి.ఈ వంటకాన్ని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయాలి.ఆరిపోయాక తింటే రుచి అంతగా బాగోదు.ఎంతో రుచికరమైన ఈ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ recipe ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
you may also like
Schezwan Sauce Recipe in Telugu
Chicken Tikka Pulao Recipe in Telugu
Saggubiyyam Punugulu Recipe inTelugu
Mutton Dalcha recipe in Telugu
Onion Murukulu recipe in Telugu
Schezwan Chicken Thighs Recipe in Telugu
Click here for the English Version of the Recipe
- 1 1/2 కప్ ఉడికించిన అన్నం
- 1 tbsp వెల్లుల్లి సన్నగా తురిమినది
- 1 tbsp అల్లం సన్నగా తురిమినది
- ½ కప్పు క్యాబేజీ తురుము
- 1 క్యారట్ తురుము
- 1/3 కప్పు ఉల్లి కాడ మొదలు తురుము
- ¼ కప్పు కొత్తిమీర
- 4 లేదా 5 tbsp షేజ్వాన్ సాస్
- 1 tbsp వెనిగర్
- ½ tsp సోయా సాస్
- ¼ tsp మిరియాల పొడి
- ఉప్పు తగినంత
- 3 tbsp నూనె
-
ఒక పెనంలో 3 tbsp ల నూనె వేడి చేసి అందులో అల్లం మరియు వెల్లుల్లి తురుము వేసి ఒక నిమిషం వేయించాలి.
-
తర్వాత ఉల్లికాడల తురుము, క్యాబేజీ తురుము, క్యారట్ తురుము వేసి రెండు నిమిషాలు వేయించాలి.
-
ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్, సోయా సాస్, షేజ్వాన్ సాస్ వేసి ఒకసారి కలపాలి.
-
తర్వాత ఉడికించిన అన్నం కూడా వేసి బాగా కలపాలి.
-
స్టవ్ ని హై ఫ్లేమ్ లోకి తిప్పి అన్నాన్ని కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించాలి.
-
ఉల్లి కాడల తురుము, కొత్తిమీర తరుగు వేసి స్టవ్ కట్టేయాలి.
Schezwan Fried Rice Video
[embedyt] https://www.youtube.com/watch?v=yz63KDn4EoA[/embedyt]