Site icon Maatamanti

Sorakaya Halwa Telugu Recipe-సొరకాయ హల్వా తయారీ

sorakaya halwa telugu recipe

Sorakaya Halwa Telugu Recipe with step by step instructions.English Version.

నా చిన్నప్పుడు మా అమ్మ సొరకాయ హల్వా ను తరచుగా చేస్తుండేవారు.మా పెరటిలో కాసిన తాజా సోరకాయలతో చేసేవారు.వేడి వేడి హల్వా ను అరటి ఆకు మీద లేదా బాదం ఆకులో పెట్టి ఇచ్చేది.ప్లేట్ లో కన్నా అలా తింటేనే రుచి ఎక్కువగా ఉంటుంది.ఎందుకంటే ఆ వేడికి అరటాకు లోని flavor హల్వా తో కలిసి చాలా రుచిగా మారుతుంది.అరటాకులో వేడి వేడి హల్వా వేసుకొని తింటే ఆ రుచే వేరు.ఇప్పుడు మా అమ్మగారు లేరు హల్వా లేదు.

ఇదే హల్వా లో కోవా కూడా వేసి చేసుకోవచ్చు.అప్పుడైతే పాలు వేయనవసరం లేదు.కోవా వేస్తే ఇంకా హల్వా కొంచెం గట్టిగా వస్తుంది.కోవా లేకపోతే కండెన్స్ డ్ మిల్క్ కూడా వేసుకొని చేసుకోవచ్చు.స్వీట్ కండెన్స్ డ్ మిల్క్ ఉపయోగిస్తున్నట్లయితే కొద్దిగా పంచదార తగ్గించి వేసుకోవాలి.వేడిగా ఉన్నప్పుడు రుచి చూస్తే హల్వా కొంచెం తీపి తక్కువగా అనిపిస్తుంది.కానీ కాస్త ఆరాక రుచి చూస్తే తీపి సరిగ్గా సరిపోతుంది.అందుకే తొందరపడి పంచదార ఎక్కువ వేసేయకండి.ఈ హల్వా ను వేడి గా తిన్నా లేదా కాసేపు ఫ్రిజ్ లో ఉంచి తిన్నా కూడా రుచిగా ఉంటుంది.నాకైతే ఛిల్డ్ హల్వా అంటేనే ఇష్టం.ఈ హల్వా ను అతి తక్కువ సమయంలో తేలికగా తయారు చేసుకోవచ్చు.మీరు కూడా ఈ రుచికరమైన సొరకాయ హల్వా ని తయారు చేస్తారని ఆశిస్తున్నాను.

you may also like

Strawberry Ravva Laddu Recipe in Telugu
Banana Balls Recipe in Telugu
Ullipaaya Murukulu Recipe in Telugu
Flax seeds Laddu Recipe in Telugu
Bounty Chocolates Recipe in Telugu
Masala Vadalu Recipe in Telugu

Sorakaya Halwa Telugu Recipe
Prep Time
15 mins
Cook Time
30 mins
Total Time
45 mins
 
Course: Dessert
Cuisine: Andhra, Hyderabadi, Indian
Author: బిందు
Ingredients
  • 300 గ్రాములు సొరకాయ తురుము
  • 1/3 కప్పు లేదా 60 ml పాలు
  • ¼ కప్పు లేదా 60 గ్రాములు పంచదార
  • 1/8 కప్పు లేదా 3 నుండి 4 tbsp నెయ్యి
  • 10 జీడిపప్పులు
  • 10 బాదంపప్పులు
  • 4 పిస్తా పప్పులు
  • 2 tbsp ఎండుద్రాక్ష
  • 1 tbsp చిరోంజి
  • ¼ tsp యాలకుల పొడి
Instructions
  1. సొరకాయ చెక్కు తీసి, లోపల గింజలు కూడా తీసేసి సన్నగా తురుముకోవాలి.
  2. ఒక పెనంలో నెయ్యి వేడి చేసి అందులో జీడిపప్పు, బాదంపప్పు ఎండుద్రాక్షలను వేయించి పక్కన పెట్టుకోవాలి.
  3. అదే పెనంలో సొరకాయ తురుము కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  4. తరవాత పాలు పోసి అవిరయ్యే వరకు వేయించాలి.
  5. పంచదార కూడా వేసి తిప్పుతూ హల్వా చక్కగా glossy గా అయ్యేవరకు లేదా నెయ్యి అంచులకు చేరేవరకు వేయించాలి.
  6. కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న పప్పులు వేసి, ఒకసారి కలిపి స్టవ్ కట్టేసుకోవాలి.

Sorakaya Halwa Telugu Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=e0753cRXlwM[/embedyt]

 

Exit mobile version