కరోనా వచ్చింది అందరి కొంపలు ముంచింది. క్వారంటైన్ అంటే కొద్దీ రోజులేగా అని సరిపెట్టుకునే పరిస్థితి లేదు. అసలెప్పుడు పరిస్థితి మళ్ళీ మాములుగా అవుతుందో ఊహించే పరిస్థితి లేదు . ప్రపంచం మొత్తం ఆగిపోయిందా అసలు భూమే తిరగడం మర్చిపోయిందా అన్నట్లు ఉంది. చిన్నప్పుడెప్పుడో ప్లేగు కలరా వంటి రోగాలు వస్తే ఊర్లకు ఊర్లు తుడిచిపెట్టుకు పోయేవి అని మన పెద్దవాళ్ళు చెప్తే విన్నాము. ప్లేగు వ్యాధిని విజయవంతంగా నిర్మూలించ గలిగినందుకు విజయ చిహ్నంగా మన చారిత్రాత్మక…