అన్నింటికన్నా కష్టమైన పని ఏంటి అని నన్నడిగితే క్షణం కూడా ఆలోచించకుండా పిల్లల్ని పెంచడం అని చెప్పేస్తాను.నాకు ఇది కష్టమనిపిస్తే వేరొకరికి ఎవరెస్ట్ ఎక్కడం అన్నింటికన్నా కష్టమనిపించవచ్చు.నిజమేనండి ఎవరెస్ట్ ఎక్కడం అత్యంత కష్టమైన పనే.అది ఎక్కి బతికి బయట పడ్డారంటే వాళ్ళు నిజంగా గొప్పే.అయితే, ఒక వ్యక్తి ఎవరెస్ట్ ఎక్కకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు కానీ ఒక పిల్లవాణ్ణి సరిగ్గా పెంచకపోతే అది వాడికి ఇంకా సమాజానికి కూడా నష్టం. రోజు పేపర్ లో వార్తలు చూస్తుంటే చాలా…
telugu blog
Blogging in Telugu- బ్లాగ్గింగ్ అంటే ఏమిటి?
బ్లాగ్గింగ్! బ్లాగ్గింగ్…. ఈ మధ్య తరచుగా ఈ మాట చాలా మంది నోట వివిపిస్తుంది.అయితే “అసలు బ్లాగ్గింగ్ అంటే ఏమిటి?దానిని ఎలా మొదలు పెట్టాలి?” లాంటి ప్రశ్నలు మొదలవుతాయి.అలాంటి ప్రశ్నలన్నింటికి నాకు తెలిసినంత వరకు మీకు అర్ధమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. What is Blogging – బ్లాగ్గింగ్ అంటే ఏమిటి? మనకు బాగా తెలిసిన విషయాలను చక్కటి పదాలతో వ్యాస రూపంలో ఇంటర్నెట్ ను మాధ్యమంగా ఉపయోగించి రాయడమే బ్లాగ్గింగ్.ఇక్కడ చక్కటి పదాలు అంటే ఏ గ్రాంధిక…
Beautiful Pink Lips – అందమైన మెరిసే గులాబీ పెదవుల కోసం చిట్కాలు
Amazing Tips for the Beautiful pink Lips. నల్లని పొడిబారిన పెదవులు మెరిసే ముఖం అందాన్ని పాడుచేస్తాయి.పెదవులు నల్లగా మారడానికి అనేక కారణాలుంటాయి. అనేక రకాల కాస్మోటిక్స్ వాడకం వల్ల తరచుగా లిప్ స్టిక్ వాడడం వల్ల పిగ్మెంటేషన్ వల్ల కొన్ని రకాల మందుల వాడకం వల్ల స్మోకింగ్ వల్ల కెఫీన్ ఉత్పత్తులు అధికంగా వాడడం వల్ల డీ హైడ్రేషన్ వల్ల కారణం ఏదైనా కానీ, కొద్దిపాటి ప్రయత్నంతో నల్లని పెదవులను మెరిసేలా మార్చుకోవచ్చు.దీనికోసం ముందుగా…
నేను – తెలుగు కథ
నేను నేను రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. లీలగా రైలు కూత వినిపిస్తుంది. అక్కడ ఒక వరుస పట్టాలు మాత్రమే వున్నాయి. అంటే రైలు నా వెనుకే వస్తుందన్నమాట. దగ్గరగా వచ్చినప్పుడు జరగొచ్చులే అనుకున్నాను. ఎందుకో అలా నడవడం నాకు భలే సరదాగా వుంది.ఏదో పెద్ద సాహసం చేస్తున్నానన్న ఫీలింగుతో హీరోలా ప్యాంటు జేబులో చేతులు వుంచి ముందుకు నడుస్తున్నాను.ఒక నిమిషం తర్వాత శబ్దం చాలా దగ్గరగా వినబడింది. వెనక్కి తిరిగి చూశాను.రైలు అప్పుడే…
వేసవి కాలం కబుర్లు – మీ చిన్ననాటి వేసవి రోజులు మీకు గుర్తున్నాయా?
మండే ఎండల్ని తలచుకుంటే వేసవి కాలం అంటేనే భయం వేస్తుంది ఎవరికైనా.కానీ వేసవి ఉదయాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి.నాకు వేసవి కాలపు ఉదయాలంటే చాలా ఇష్టం.పగలంతా ఎంత వేడిగా ఉన్నా తెల్లవారు ఝాము సమయానికి మాత్రం వాతావరణం చల్లగా ఉంటుంది.అందుకే నేను వేసవిలో చాలా తొందరగా నిద్ర లేస్తాను.చక్కని చిక్కని కాఫీ కలుపుకొని బయట వరండాలో కూర్చుంటాను.కమ్మని కాఫీ సువాసనను ఆస్వాదిస్తూ మెల్లిగా సిప్ చేస్తూ అప్పుడే తెల్లవారుతున్న ఆకాశాన్ని చూస్తూ ఉంటాను. చల్లని పిల్ల తెమ్మెరలు…