మన అందరి బాల్యం, యవ్వనం ఎన్నో తీపి జ్ఞాపకాలతో లేదా చేదు అనుభవాలతో నిండి ఉంటుంది.కానీ మనం అందులోని తీపి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ మిగతా జీవితాన్ని మెల్లిగా వెళ్ళదీస్తాము.ఆ జ్ఞాపకం ఒక ప్రదేశం, వ్యక్తి, సంఘటన ఇలా ఏదైనా కావొచ్చు.ఆ జ్ఞాపకాలతో కూడిన ప్రదేశాలను, వ్యక్తులను ఒక్కసారి మళ్లీ చూస్తే బాగుండుననిపిస్తుంది. నాకూ అలానే అనిపిస్తుంటుంది.నా జ్ఞాపకాలలో వ్యక్తుల కన్నా ఎక్కువగా ప్రదేశాలే ఉన్నాయి.ఏ కాస్త ఖాళీ సమయం చిక్కినా, నా మధుర జ్ఞాపకాలను చాపలుగా…
telugu website
పిల్లల్లో నేర ప్రవృత్తి పెరగడానికి గల కారణాలు ఏంటి?
అన్నింటికన్నా కష్టమైన పని ఏంటి అని నన్నడిగితే క్షణం కూడా ఆలోచించకుండా పిల్లల్ని పెంచడం అని చెప్పేస్తాను.నాకు ఇది కష్టమనిపిస్తే వేరొకరికి ఎవరెస్ట్ ఎక్కడం అన్నింటికన్నా కష్టమనిపించవచ్చు.నిజమేనండి ఎవరెస్ట్ ఎక్కడం అత్యంత కష్టమైన పనే.అది ఎక్కి బతికి బయట పడ్డారంటే వాళ్ళు నిజంగా గొప్పే.అయితే, ఒక వ్యక్తి ఎవరెస్ట్ ఎక్కకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు కానీ ఒక పిల్లవాణ్ణి సరిగ్గా పెంచకపోతే అది వాడికి ఇంకా సమాజానికి కూడా నష్టం. రోజు పేపర్ లో వార్తలు చూస్తుంటే చాలా…
నేను – తెలుగు కథ
నేను నేను రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. లీలగా రైలు కూత వినిపిస్తుంది. అక్కడ ఒక వరుస పట్టాలు మాత్రమే వున్నాయి. అంటే రైలు నా వెనుకే వస్తుందన్నమాట. దగ్గరగా వచ్చినప్పుడు జరగొచ్చులే అనుకున్నాను. ఎందుకో అలా నడవడం నాకు భలే సరదాగా వుంది.ఏదో పెద్ద సాహసం చేస్తున్నానన్న ఫీలింగుతో హీరోలా ప్యాంటు జేబులో చేతులు వుంచి ముందుకు నడుస్తున్నాను.ఒక నిమిషం తర్వాత శబ్దం చాలా దగ్గరగా వినబడింది. వెనక్కి తిరిగి చూశాను.రైలు అప్పుడే…
వేసవి కాలం కబుర్లు – మీ చిన్ననాటి వేసవి రోజులు మీకు గుర్తున్నాయా?
మండే ఎండల్ని తలచుకుంటే వేసవి కాలం అంటేనే భయం వేస్తుంది ఎవరికైనా.కానీ వేసవి ఉదయాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి.నాకు వేసవి కాలపు ఉదయాలంటే చాలా ఇష్టం.పగలంతా ఎంత వేడిగా ఉన్నా తెల్లవారు ఝాము సమయానికి మాత్రం వాతావరణం చల్లగా ఉంటుంది.అందుకే నేను వేసవిలో చాలా తొందరగా నిద్ర లేస్తాను.చక్కని చిక్కని కాఫీ కలుపుకొని బయట వరండాలో కూర్చుంటాను.కమ్మని కాఫీ సువాసనను ఆస్వాదిస్తూ మెల్లిగా సిప్ చేస్తూ అప్పుడే తెల్లవారుతున్న ఆకాశాన్ని చూస్తూ ఉంటాను. చల్లని పిల్ల తెమ్మెరలు…