Thotakura Pesara Pappu Fry Recipe with step by step instructions.English Version.
చాలా సులువుగా చేయగలిగిన తోటకూర వంటకాలలో ఈ తోటకూర పెసరపప్పు వేపుడు ఒకటి.దీని కోసం పెసరపప్పు ను మరియు తోటకూర లను ఉడికించాలి.ఆకుకూరలను ఎక్కువ సేపు ఉడికిస్తే వాటిల్లోని పోషకాలు నశించిపోతాయి.అందుకే ఎక్కువ సేపు ఉడికించ కూడదు.నేను పెసరపప్పు పూర్తిగా ఉడికినాక అప్పుడు అందులోనే తరిగిన తోటకూర వేసి కేవలం రెండు నిమిషాలు ఉడికించి పొయ్యి కట్టేశాను.
తోటకూర ను ఉడికించకుండా వండితే ఒక విధమైన పసర వాసన వస్తుంది.సరిగ్గా తినలేము.నేను రెండు నిమిషాలు మాత్రమే ఉడికించి నీళ్ళు వార్చేసి తాలింపులో కేవలం ఒక నిమిషం మాత్రమే కలుపుతూ వేయించి దించేశాను.వార్చిన నీళ్ళను వృధా చేయ కుండా కొద్దిగా ఉప్పు వేసి తాగవచ్చు.లేదా అన్నం వండడానికి వాడవచ్చు.ఈ ఇగురులో పెసరపప్పు కూ బదులుగా కందిపప్పు ను ఉపయోగించవచ్చు.ఈ వేపుడు కూరను వేడి వేడి అన్నం ఇంకా నెయ్యిలతో కలిపి వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది.ఈ రుచికరమైన ఫ్రై recipe ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Potato Fry Recipe in Telugu
Boiled Eggs Fry Recipe in Telugu
Fish Fry Recipe in Telugu
Andhra Chicken Fry Recipe in Telugu
Click here for the English Version of the Recipe.
- 200 గ్రాములు తోటకూర
- ¼ కప్పు లేదా 50 గ్రాములు పెసరపప్పు
- ½ tsp ఆవాలు
- ½ tsp జీలకర్ర
- 1 ఎండుమిరపకాయ
- 3 వెల్లుల్లి రెబ్బలు
- 1 రెమ్మ కరివేపాకు
- ½ tsp పసుపు
- 1 ½ tsp కారం
- ఉప్పు తగినంత
- నీళ్ళు సరిపడా
-
తోటకూర లో మట్టి మరియు ఇసుక పోయే వరకు నీళ్ళలో జాగ్రత్తగా శుభ్రం చేయాలి.
-
తోటకూరను తరిగి పక్కన పెట్టుకోవాలి.
-
పెసరపప్పు ను కడిగి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టాలి.
-
ఒక మందపాటి పాత్రలో ఉడికించడానికి సరిపడా నీళ్ళు పోసి పెసరపప్పు కూడా వేసి మరిగించాలి.
-
పెసరపప్పు పూర్తిగా ఉడికాక తరిగి ఉంచుకున్న తోటకూర కూడా వేసి కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఉడికించి పొయ్యి కట్టేయాలి.
-
వెంటనే నీళ్ళు వార్చేయాలి.
-
ఒక బాణలిలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, వెల్లుల్లి తరుగు, కరివేపాకు వేసి చిటపట లాడేవరకు వేయించాలి.
-
అందులో ఉడికించిన పెసరపప్పు & తోటకూర ను వేసి బాగా కలిపి ఒక నిమిషం పాటు వేయించి పొయ్యి కట్టేయాలి.
Thotakura Pesara Pappu Fry Recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=vWWMzacDLCY[/embedyt]