Maatamanti

Tomato Pudina Chutney Telugu Recipe-టమాటో పుదీనా పచ్చడి

Tomato Pudina Chutney Telugu Recipe with step by step instructions.English Version.

మా అమ్మ ఎప్పుడూ పచ్చి టమాటో లతోనే పచ్చడి చేసేవారు.పచ్చి టమాటాలను పెద్ద ముక్కలుగా కోసి వాటిని నూనె లో మగ్గేవరకు వేయించేవారు.తరవాత రోట్లో పచ్చడి నూరే వారు.వేడి వేడి అన్నం లో నెయ్యి, ఈ పచ్చడి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉండేది.ఎంతైనా రోట్లో నూరితే వచ్చే రుచి మిక్సీ లో వేస్తే రాదు.నేనైతే ఎక్కువగా మామూలు పండు టమాటాలతోనే చేస్తాను.ప్రతిసారి వాటిని వేయించాక  మిక్సీలో వేసేముందు “చక్కగా రోటి పచ్చడి లా కచ్చాపచ్చా గా నూరాలి” అనుకుంటాను.కానీ కనీసం రెండు సెకెన్లయినా తిప్పకుండానే అది చక్కగా టమాటో puree లా అయిపోతుంది.నాకేమో అలాంటి చట్నీ అస్సలు తినబుద్దికాదు.ప్చ్! కానీ ఏం చేస్తాం?చచ్చినట్టు అదే తినాలి.

అలాంటి puree లాంటి చట్నీ తినడం ఇష్టం లేకపోతే ఎంచక్కా ఇలా పచ్చి టమాటాలతో చేసుకుంటే బాగుంటుంది.పచ్చి టమాటాలు కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి మిక్సీలో వేసినా వెంటనే పేస్ట్ లా అవ్వకుండా రోటి పచ్చడి మాదిరిగానే ఉంటుంది.కాకపొతే పచ్చి టమాటాలలో ఎక్కువ పులుపు ఉండదు కాబట్టి పులుపు కోసం కొద్దిగా చింతపండు వేసుకోవాలి.ఈ పచ్చడిలో నేను కొద్దిగా పుదీనా కూడా వేశాను.ఈ పచ్చడి కోసం వాడిన టమాటోలు మా పొలంలో పండించినవే.మేము స్వయంగా పండించిన వాటితో వంట చేసుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది.ఈ వాక్యం AROKYA మిల్క్ ad లో ఆమె “మా పొలంలో  పనిచేసుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది” అన్నట్లుగా ఉంది కదూ.ఆ ad చూసిన ప్రతిసారీ నాకు ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి.

సరే ఇక చట్నీ విషయానికొస్తే, దీనిని వేడి అన్నం తో గానీ, దోసెలతో గానీ, పునుగులతో గానీ, చపాతీ లతో గానీ తింటే చాలా బాగుంటుంది.పెరుగన్నంలో నంజు కి కూడా చాలా బాగుంటుంది.పచ్చడి చక్కగా కచ్చాపచ్చా గా రావాలంటే వేయించేటప్పుడు టమాటా ముక్కల్ని గరిటెతో ఎక్కువ తిప్పకూడదు.జస్ట్ ముక్కల్ని మగ్గనివ్వాలి.ఎక్కువగా తిప్పడం వల్ల టమాటాలలోని నీరు బయటకి వచ్చి బయటి ఫ్లెష్ తొందరగా ఉడికి పేస్ట్ లా అయిపోతుంది.కదపకపొతే లోపల నీరు బయటకి రాకుండానే ఆవిరయిపోతుంది.friends!ఈ రుచికరమైన టమాటో పుదీనా పచ్చడిని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Mushroom Pickle Recipe in Telugu
Pandu Mirapakaya Pickle Recipe in Telugu
Andhra Mango Pickle Recipe in Telugu
Cauliflower Pickle Recipe in Telugu
Bangaladumpa Vepudu Recipe in Telugu

Click Here for the English Version of this Recipe.

Tomato Pudina Chutney Telugu Recipe
Prep Time
10 mins
Cook Time
30 mins
Total Time
40 mins
 
Course: Main Course
Cuisine: Andhra, Hyderabadi, Telangana
Author: బిందు
Ingredients
  • 500 గ్రాములు పచ్చి టమాటోలు
  • 7 లేదా 8 పచ్చి మిరపకాయలు
  • 1/3 కప్పు పుదీనా ఆకులు
  • 10 గ్రాములు చింతపండు
  • 1 tsp మినప పప్పు
  • 1 tsp ధనియాలు
  • 1 tsp జీలకర్ర
  • ఉప్పు తగినంత
  • 4 వెల్లుల్లి రెబ్బలు
  • 5 tbsp నూనె
  • 2 రెమ్మలు కొత్తిమీర
Instructions
  1. ఒక పెనంలో 2 tbsp నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ధనియాలు, మినప పప్పు, పచ్చి మిర్చి, చింతపండు వేసి పచ్చి మిరపకాయలు రంగు మారే వరకు వేయించాలి.
  2. తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
  3. అదే పెనంలో మరో 3 tbsp ల నూనె వేసి అందులో పచ్చి టమాటో ముక్కలు వేసి ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి.
  4. తర్వాత పుదీనా ఆకులు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
  5. వేయించిన పదార్దాలన్నింటిని మిక్సీ జార్ లో వేసి అందులోనే ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చా గా గ్రైండ్ చేసుకోవాలి.
  6. కొత్తిమీర తరుగు వేసి వేడి వేడి అన్నంతో వడ్డించాలి.

Tomato Pudina Chutney Telugu Recipe Video

[embedyt]https://youtu.be/GE5LRi8Wcwc[/embedyt]

 

Related Post

Please Share this post if you like