Ulli Karam dosa Telugu recipe with step by step instructions.English Version.
రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ తినీ తినీ బోర్ కొట్టినప్పుడు ఇలా ఉల్లి కారం తో దోశెలు చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్ ని సర్ ప్రైజ్ చేయవచ్చు.స్ట్రీట్ ఫుడ్ దోశ బండి వాళ్ళు ఇలాంటి ఒక దోసెకు 100 నుండి 120 రూపాయల వరకు తీసుకుంటారు.అదే మనం ఇంట్లో చేసుకుంటే అదే ఖర్చుతో 4 నుండి 5 దోసెల వరకు చేసుకోవచ్చు.
నేను ఈ దోసె లో ఉల్లి కారం తో పాటు ఛీజ్ తురుము కూడా వేశాను.కావాలంటే మీరు పనీర్ తురుము కూడా ఉపయోగించవచ్చు.అసలవేమీ లేకుండా ఉల్లి కారం తోనే దోశెలు వేసుకున్నా చాలా రుచిగా ఉంటాయి.అవి ఎక్స్ట్రా టేస్ట్ కొరకు మాత్రమే.మీరు కొద్దిగా కారం ఎక్కువగా తినేవారయితే ఉల్లి కారం చట్నీ లో చింతపండు వేయకపోయినా పర్వాలేదు.
కొన్ని ప్రాంతాలలో దోసెలలో ఉపయోగించే ఉల్లి కారం కోసం ఉల్లిపాయలను వేయించకుండానే వాడతారు.ఉల్లిపాయలు, ఉప్పు, కారం లను వేయించకుండా గ్రైండ్ చేసి నేరుగా దోసె లో ఉపయోగిస్తారు.ఇలా కూడా దోశెలు రుచిగానే ఉంటాయి.ఈ దోసెలను పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీ లతో వేడి వేడి గా వడ్డిస్తే చాలా రుచిగా ఉంటాయి.ఈ ఉల్లి కారం దోసె recipe ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Leftover bread Pancake Recipe in Telugu
Saggubiyyam Punugulu Recipe in Telugu
Click here for the English version of this recipe.
- 3 మీడియం సైజు ఉల్లిపాయలు
- 7 లేదా 8 ఎండు మిరపకాయలు
- 1 tsp జీలకర్ర
- 10 గ్రాములు చింతపండు
- 4 వెల్లుల్లి రెబ్బలు
- ఉప్పు తగినంత
- 3 tsp నూనె
- అవసరమైనంత దోశ పిండి
- 2 tsp నూనె ఒక్కో దోసెకు
- ¼ కప్పు కొత్తిమీర
- 100 గ్రాములు ఛీజ్ తురుము
- పెనంలో 3 tsp ల నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఎండు మిర్చి వేసి 1 నిమిషం వేయించాలి.
- తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.
- పొయ్యి కట్టేసి వాటిని చల్లారనివ్వాలి.
- తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
- పెనం మీద రెండు చుక్కలు నూనె వేసి పేపర్ నాప్కిన్ తో రుద్దాలి. ఇలా సీజనింగ్ చేయడం వల్ల దోసెలు పెనానికి అతుక్కోకుండా చక్కగా వస్తాయి.
- మంట హై ఫ్లేమ్ లో ఉంచి రెండు గరిటెల దోసెల పిండి వేసి గుండ్రంగా పెనం అంతా పరుచుకునేలా తిప్పాలి.
- ఒక 10 సెకన్లు ఆగి అప్పుడు సుమారు 2 tsp ల నూనె దోసె మీద ఇంకా చుట్టూరా వేయాలి.
- ఉల్లి కారం కూడా వేసి దోసె మీద రాయాలి.
- ఛీజ్ తురుము వేసి కరికే వరకు ఆగాలి.
- తరిగిన కొత్తిమీర వేసి దోసె ను మడిచి వేడి వేడి గా పల్లీ చట్నీ తో గానీ కొబ్బరి చట్నీ తో గానీ వడ్డించాలి.
Ulli Karam Dosa Telugu Recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=rWXkw3ZjZUI[/embedyt]
Leave a Reply