Vegetable cutlets recipe in Telugu with step by step instructions
ఈ వెజ్ కట్లెట్ recipe ని నేను మా YouTube subscriber ఒకరు అడిగితే పోస్ట్ చేశాను.ఈ recipe ని నేను తరచుగా చేస్తూ ఉంటాను.ఒక్కోసారి ఒక్కోలాగా తయారు చేస్తాను.ఒక సారి ఉన్న vegetables ఒక సారి ఉండవు కదా మరి.ముందుగా మనం వెజ్ కట్లెట్స్ తయారీకి ఎటువంటి కూరగాయలను ఉపయోగించవచ్చో చూద్దాం.దీని కోసం బంగాళదుంప/ఆలుగడ్డ, బీట్ రూట్, క్యారెట్, పచ్చి బఠానీలు, కాప్సికం, ఫ్రెంచ్ బీన్స్, క్యాబేజీ, క్యాలిఫ్లవర్ మున్నగు కూరగాయలను వాడవచ్చు.
పైన చెప్పిన కురగాయాలలో ఏది ఉన్నా లేకపోయినా ఆలుగడ్డ ఉండేలాగా చూసుకోవాలి.ఎందుకంటే ఆలుగడ్డ binding కి బాగా ఉపయోగపడుతుంది.ఆలుగడ్డలతో పాటు ఇంకో నాలుగు రకాల vegetables ని తీసుకొని వాటిని మరిగే నీటిలో 5 నుండి 7 నిమిషాల పాటు ఉడికించి తర్వాత కొద్దిగా కూడా నీరు లేకుండా వడకట్టేయాలి.పచ్చి బఠాణీ, స్వీట్ కార్న్ లను మరీ మెత్తగా కాకుండా కొద్దిగా మెదిపి పెట్టుకోవాలి.
తర్వాత కట్లెట్ కోటింగ్ కోసం కార్న్ స్టార్చ్ మరియు బ్రెడ్ క్రంబ్స్ తీసుకోవాలి.బ్రెడ్ క్రంబ్స్ అన్ని సూపర్ మార్కెట్లలో సులభంగా దొరుకుతాయి.ఒకవేళ మీరు ఈ కట్లెట్స్ తయారు చేయాలనుకునే సమయానికి బ్రెడ్ క్రంబ్స్ లేకపోతే 2 కప్పుల కార్న్ ఫ్లేక్స్ ని మిక్సిలో పొడి చేసి వాడవచ్చు.
ఇవే కట్లెట్స్ ని కొంచెం వైవిధ్యంగా చేయాలనుకుంటే ఒక 100 గ్రాములు పనీర్ తురుము కూడా కలుపుకోవచ్చు.లేదా కట్లెట్ మిక్స్చర్ ని ఉండలుగా చేసి మధ్యలో ఛీజ్ క్యూబ్ ఉంచి కూడా ఫ్రై చేసుకోవచ్చు.కాని వేయించేటపుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే ఛీజ్ కరిగి బయటకు రావొచ్చు.
ఈ కట్లెట్స్ వేయించిన వెంటనే తింటే కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి.టమాటో సాస్ తో గాని, గ్రీన్ చట్నీతో గాని, మయోన్నిస్ తో గాని తింటే బాగుంటాయి.ఎటువంటి accompaniment లేకుండా ఉట్టిగా సర్వ్ చేసినా కూడా బాగానే ఉంటాయి.ఈ రుచికరమైన recipe ని మీరు కూడా try చేయగలరు.
you may also like ఉలవచారు ఇంట్లోనే తయారు చేయడం ఎలా?
- 4 చిన్న బంగాళాదుంపలు
- 1/4 కప్పు పచ్చి బఠాణీలు
- 1/4 కప్పు స్వీట్ కార్న్
- మరిగించడానికి సరిపడా నీళ్ళు
- ఉడికించి పెట్టుకున్న కూరగాయలు
- 1/4 కప్పు తురిమిన క్యారెట్
- 1/4 కప్పు క్యాప్సికం ముక్కలు
- 1/4 కప్పు పుదినా ఆకులు
- 4 రెమ్మలు కొత్తిమీర
- 2 పచ్చి మిర్చి
- 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
- సరిపడా ఉప్పు
- 1 tsp కారం
- 1 tsp మిరియాల పొడి
- 1/2 tsp చాట్ మసాలా
- 2 కప్పులు కార్న్ ఫ్లేక్స్
- 1/8 కప్పు కార్న్ ఫ్లోర్
- 1/4 కప్పు నీళ్ళు
- వేయించడానికి సరిపడా నూనె
బంగాళాదుంపల్ని బాగా కడిగి సగానికి కోయాలి.
మరిగే నీటిలో బంగాళాదుంప ముక్కల్ని, పచ్చి బఠానీలని, స్వీట్ కార్న్ లను వేసి 5 నుండి 7 నిమిషాల వరకు మరిగించాలి.
తర్వాత నీళ్ళని వడకట్టేసి ఉడికించిన వాటిని పక్కన పెట్టుకోండి.
బంగాళాదుంపల్ని తురిమి పక్కన పెట్టుకోండి.
పచ్చి బఠాణీ, స్వీట్ కార్న్ లను మరీ మెత్తగా కాకుండా కొద్దిగా మెదిపి పెట్టుకోండి.
ఒక గిన్నెలో ఉడికించిన బంగాళాదుంప తురుము, పచ్చి బఠాణీ&స్వీట్ కార్న్ ముద్ద, క్యారెట్ తురుము, క్యాప్సికం తరుగు, పుదినా ఆకులు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, మిరియాల పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి.
తయారుచేసిన మిక్స్చర్ గట్టిగా లేకపోతే కొంచెం బ్రెడ్ క్రంబ్స్ వేసి కలపొచ్చు.
2 కప్పుల కార్న్ ఫ్లేక్స్ ని మిక్సీలో వేసి పొడి చేయాలి.
1/8 కప్పు కార్న్ ఫ్లోర్ లో 1/4 కప్పు నీళ్ళు పోసి బాగా కలిపి ఉంచుకోవాలి.
నిమ్మకాయ పరిమాణంలో మిక్స్చర్ ని తీసుకొని గారెల్లా చేసి ముందు కార్న్ స్టార్చ్ లో ముంచి తరవాత బ్రెడ్ క్రంబ్స్ తో కోటింగ్ చేయాలి.
ఇలా అన్నింటిని చేసి పక్కన పెట్టుకోవాలి
ఒక బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడిచేయాలి.
తయారు చేసి పెట్టుకున్న కట్లెట్స్ ని నూనె లో జాగ్రత్తగా జారవిడవాలి.
రెండు వైపులా తిప్పుతూ బంగారు వర్ణం వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ లోకి తీసుకోవాలి.
Vegetable Cutlets Video
[embedyt] http://www.youtube.com/watch?v=1-_DButyPHM[/embedyt]
Leave a Reply