White Sauce Pasta Telugu Recipe with step by step instructions.English Version.
వైట్ సాస్ పాస్తా ని నేను ఫస్ట్ టైం కరాచీ బేకరీ లో తిన్నాను.”తినగానే సూపర్ గా నచ్చేసింది” అని అంటాననుకున్నారు కదూ.కాదు ఫస్ట్ టైం తినగానే ఆ వేడికి నోరు బాగా కాలింది.అయినా సరే తిన్నాను కానీ టేస్ట్ అర్ధం కాలేదు.అయినా మనకి ఏ కాడికి మాంచి ఎర్రగా కారంతో ఉన్నవే నచ్చుతాయి కానీ తెల్ల తెల్లగా ఉంటే చప్పగా ఉంటుందేమో అని తినాలనిపించదు.
బట్ సెకండ్ టైం కాస్త జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తిన్నాను.ఇప్పుడు చెప్తున్నాను.”టేస్ట్ సూపర్ సూపర్ ;)_”.ఆ తర్వాత కొన్ని రోజులకి మా అమ్మాయి అడిగితే ఇంట్లోనే తయారు చేశాను.మొదటిసారి చేసినప్పుడు ఓ మాదిరిగా కుదిరింది.రెండో సారి చేసే సరికి కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇంకా బాగా తయారు చేశాను.ఇక ఇప్పుడైతే మా అమ్మాయికి వారంలో కనీసం రెండుసార్లయినా పాస్తా చేసి పెట్టాల్సిందే.
అందుకే దానికి కావాల్సిన పదార్ధాలన్నీ ఎప్పుడూ ఇంట్లో సిద్దంగా ఉంచుకుంటాను.పాస్తా ని ఒకేసారి ఉడికించుకొని ఒక రెండు రోజుల వరకు ఫ్రిజ్ లో ఉంచుకోవచ్చు.వైట్ సాస్ కూడా తయారు చేసి పెట్టుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు.ఇవి రెండు నుండి 3 రోజుల లోపే వాడేస్తే మంచిది.నేనైతే ఎప్పుడూ 2 రోజుల కన్నా ఎక్కువ ఉంచలేదు.సో 3 రోజుల తర్వాత ఎలా ఉంటుందో ఐడియా లేదు.
నాకయితే పాస్తా మరీ గట్టిగా కాకుండా వైట్ సాస్ ఎక్కువగా ఉంటే ఇష్టం.అలా అయితేనే జూసీ గా బాగుంటుంది.పాస్తా seasoning mix, మిరియాల పొడి కాస్త ఎక్కువగానే వేస్తాను.నేను ఈ recipe లో vegetables వాడాను కదా.ఒక్కోసారి అన్నీ కూరగాయలు అందుబాటులో ఉండక పోవచ్చు.అలాంటప్పుడు ఉన్నవాటితోనే చేయొచ్చు.అసలు vegetables లేకుండా చేసినా కూడా బాగుంటుంది.కానీ పాస్తాని మాత్రం కాస్త జాగ్రత్తగా ఉడికించాలి.తక్కువ సేపు ఉడికిస్తే మరీ గట్టిగా ఉంటాయి.పొరబాటున ఎక్కువ సేపు ఉడికిస్తే మెత్తగా పేస్ట్ లా విడిపోతాయి.
అందుకే ఒకసారి మరగడం మొదలవగానే దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి.ఉడికాక పాస్తా సైజులో డబుల్ అవ్వాలి.పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలంటే ఉడికించేటప్పుడు కాస్త ఆయిల్ వేయాలి.తగినంత ఉప్పు కూడా వేయాలి.ఛీజ్ వేయక పోయినా పర్వాలేదు.వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందంతే.సర్వ్ చేసే ముందు కొద్దిగా మిరియాల పొడి, పాస్తా మిక్స్ చల్లాలి.ఈ recipe ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Creamy Tomato Soup Recipe
Leftover Bread Pancake Recipe in Telugu
Chinese Egg Noodles Recipe in Telugu
Dry Fruit Laddu Recipe in Telugu
Click here for the English Version of this Recipe
మరిన్ని తెలుగు video recipes కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 1 కప్పు లేదా 100 గ్రాములు పెన్నే పాస్తా
- 1 ½ లీటర్లు నీళ్ళు
- ఉప్పు తగినంత
- 1 tbsp నూనె
- 2 లేదా 3 tsp నూనె
- ¼ కప్పు స్వీట్ కార్న్
- 50 గ్రాములు బ్రోకలి
- ¼ కప్పు క్యారెట్ తురుము
- ¼ కప్పు క్యాప్సికం
- 50 గ్రాములు బటర్
- 1 tbsp వెల్లుల్లి తురుము
- 2 tbsp మైదా
- 1 బిర్యానీ ఆకు
- ½ ముక్క ఉల్లి
- 3 లవంగాలు
- 500 లేదా 600 ml పాలు
- ఉప్పు తగినంత
- ¼ tsp చిల్లీ ఫ్లేక్స్
- ½ లేదా 1 tsp మిరియాల పొడి
- ½ లేదా 1 tsp పాస్తా మిక్స్(seasoning)
- 50 గ్రాములు ఛీజ్ తురుము(షెడార్/మోజ్జరెల్లా)
- ఒక గిన్నెలో సుమారు 1 ½ లీటర్ల నీళ్ళు పోసి మరిగించాలి.
- నీళ్ళు మరగడం మొదలవగానే అందులో తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి ఒకసారి కలపాలి.
- అందులో పెన్నే పాస్తా వేసి మరిగించాలి.
- పాస్తా సరిగ్గా ఉడకడానికి 10 నుండి 15 నిమిషాలు పడుతుంది.ఉడికాక సైజులో డబుల్ అవుతుంది.
- పాస్తా ఉడకగానే నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
- ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పైన చెప్పిన కూరగాయలన్నింటిని వేసి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించి స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి.
- ఒక సాస్ పాన్ లో బటర్ వేసి కరిగించాలి.
- అందులో వెల్లుల్లి తురుము వేసి అర నిమిషం పాటు వేయించాలి.
- తర్వాత మైదా పిండి వేసి కలుపుతూ లేత బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.
- పాలు కొద్ది కొద్దిగా పోస్తూ మైదా పిండి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
- ఉల్లిపాయ ముక్క పైన బిర్యానీ ఆకు ఉంచి దానిని లవంగాలతో గుచ్చి సాస్ పాన్ లో వేయాలి.
- సాస్ కొద్దిగా చిక్కబడే వరకు మెల్లగా గరిటెతో తిప్పుతుండాలి.
- సాస్ చిక్కబడగానే ఉల్లిపాయ తీసి పక్కన పెట్టేయాలి.
- తగినంత ఉప్పు వేస్తే వైట్ సాస్ రెడీ.
- తయారు చేసి పెట్టుకున్న సాస్ లో మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, పాస్తా mix వేసి కలపాలి.
- ఛీజ్ తురుము వేసి కరికే వరకు కలపాలి.
- వేయించి పెట్టుకున్న కూరగాయలు, ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసి రెండు నిమిషాల పాటు సన్నని సెగ మీద అన్ని బాగా కలిసేలా కలపాలి.
- స్టవ్ కట్టేసి, పాస్తా ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొద్దిగా పాస్తా mix, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి చల్లి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
Leave a Reply