లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి, బిర్యానీ పూలు, సోంపు, షాజీరా లను దోరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
చికెన్ ను మారినేట్ చేయుట
ఒక బౌల్ లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, బిర్యానీ మసాలా, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, సగం చెక్క నిమ్మ రసం, పెరుగు వేసి బాగా కలిపి ఒక గంట పాటు నానబెట్టాలి.
బియ్యం నానబెట్టుట
చికెన్ అరగంట నానిన తర్వాత బియ్యం కూడా 30 నిమిషాలు నానబెట్టుకోవాలి.
అప్పుడు చికెన్ మారినేట్ ఇంకా బియ్యం ఒకేసారి సిద్దంగా ఉంటాయి.
బిర్యానీ చేయుట
ఒక ప్రెషర్ కుక్కర్ ను స్టవ్ మీద ఉంచి, 3 tbsp ల నెయ్యి ఇంకా 4 tbsp ల నూనె వేసి వేడి చేయాలి.
అన్ని గరం మసాలా దినుసులు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి బ్రౌన్ గా అయ్యే వరకు వేయించాలి.
తర్వాత చికెన్ మారినేట్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నుండి 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఉడికించాలి.
మూత తెరవగానే ఒకసారి కలపాలి. చికెన్ మారినేట్ లో నుండి సుమారు 2 కప్పుల నీరు బయటకు వస్తుంది.
అందులో నానబెట్టిన బియ్యం వేసి కలపాలి.
3 కప్పుల బియ్యానికి అదే కప్పుతో 5 కప్పుల నీళ్ళు పోయాల్సి ఉంటుంది.కానీ చికెన్ లో నుండి ఊరిన నీరు సుమారు 2 కప్పులు ఉండడం వల్ల ఇంకా 3 కప్పులు నీళ్ళు పోస్తే సరిపోతుంది.
ఉప్పు రుచి చూసి సరిపడినంత వేయాలి.పుదీనా ఆకులు, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ కట్టేయాలి.