Cuisine
Andhra, Hyderabadi, South Indian, Telangana
Prep Time16hours
Cook Time5minutes
Total Time16hours5minutes
Authorబిందు
Ingredients
నానబెట్టుట కొరకు
1కప్పుపచ్చ పెసలు
½కప్పుబియ్యం
తగినంతనీళ్ళు నానబెట్టుటకు
పిండి కొరకు
1కప్పుఓట్స్
1అంగుళం అల్లం ముక్క
1పచ్చి మిరపకాయ
½tspజీలకర్ర
ఉప్పు తగినంత
నీళ్ళు తగినంత
స్టఫ్ కొరకు
1మీడియంఉల్లిపాయ తరుగు
2క్యారెట్ ల తరుగు
¼కప్పుకొత్తిమీర తరుగు
½అంగుళం అల్లం తరుగు
1పచ్చి మిరపకాయ తరుగు
1tspనూనె
దోసె కొరకు
1tspనూనె ఒక్కో దోసెకు
Instructions
నానబెట్టుట మరియు మొలకెత్తించు విధానం
ఉదయాన్నే ఒక కప్పు పచ్చ పెసలను నానబెట్టాలి.
సాయంత్రం వరకు నాననిచ్చి రెండు మూడు సార్లు శుభ్రం గా కడిగి నీళ్ళు పూర్తిగా వొంపేయాలి.
ఒక శుభ్రమైన కాటన్ వస్త్రం లో కానీ జల్లెడ లో కానీ ఉంచి పెసలను మూసేసి రాత్రంతా వదిలేయాలి.
తెల్లవారే సరికి కొద్ది కొద్దిగా మొలకలు వచ్చి కనిపిస్తాయి.
అప్పుడు బియ్యం కూడా 3 నుండి 4 గంటల పాటు నానబెట్టాలి.
బియ్యం నానే సరికి మొలకలు ఇంకొంచెం పెద్దవి అవుతాయి.
పిండి తయారీ
మిక్సీ జార్ లో మొలకెత్తిన పెసలు, నానబెట్టిన బియ్యం, ఓట్స్, అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఉప్పు వేయాలి.
తగినంత నీళ్ళు పోసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్లుగా పిండి రుబ్బుకోవాలి.
ఈ పిండిని పొంగే వరకు ఆగకుండా వెంటనే ఉపయోగించాలి.
పెసరట్టు తయారీ
పెనంలో 1 tsp నూనె వేడి చేసి అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, అల్లం, క్యారెట్, కొత్తిమీర వేసి రెండు నిమిషాలు వేయించి పక్కన పెట్టేసుకోవాలి.
అదే పెనంలో రెండు గరిటెల పెసరట్టు పిండి పోసి చక్కగా గుండ్రంగా పెనం అంతా పరచుకునేలా తిప్పాలి.
1 tsp నూనె దోసె చుట్టూరా వేసి చక్కగా రోస్ట్ అయ్యే వరకు కాల్చాలి.
దోసె మధ్యలో వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్ తరుగుల మిశ్రమం వేసి దోసెను మడిచి వేడి వేడిగా ఉప్మా తో గానీ, కొబ్బరి చట్నీ తో గానీ, తీపి అల్లం చట్నీ తో గానీ వడ్డించాలి.