Go Back
Print
Recipe Image
Smaller
Normal
Larger
Print
Palak paneer Telugu Recipe
Course
Main Course
Cuisine
Indian
Prep Time
15
minutes
Cook Time
15
minutes
Total Time
30
minutes
Servings
3
Author
బిందు
Ingredients
200
గ్రాములు
పాలకూర
200
గ్రాములు
పనీర్
1/2
కప్పు
టమాటో పేస్ట్
2
మీడియం ఉల్లిపాయలు
2
పచ్చి మిరపకాయలు
25
నుండి 30 గ్రాములు
బటర్
1 1/2
tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్
1
tsp
సోంపు
3
+ 2
ఏలకులు
6
జీడి పప్పులు
3
లవంగాలు
2
దాల్చిన చెక్కలు అంగుళం పొడవు
చిటికెడు పంచదార
1
tsp
జీలకర్ర
ఉప్పు తగినంత
1
tsp
కారం
1/2
tsp
పసుపు
1
tsp
గరం మసాలా
1/4
కప్పు
నీళ్లు
2
tbsp
క్రీమ్
Instructions
పనీర్ ను నానబెట్టుట
ముందు పనీర్ ను క్యూబ్స్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
మరిగిన నీటిలో తగినంత ఉప్పు కలిపి పనీర్ ముక్కలను అందులో వేసి 5 నుండి 10 నిమిషాలు నానబెట్టాలి.
పాలక్ ను బ్లాంచ్ మరియు ప్యూరీ చేయుట
పాలకూరను శుభ్రంగా కడిగిన తరువాత మరిగిన నీటిలో ఉప్పు వేసి 2 నుండి 3 నిమిషాలు నానబెట్టాలి.
వేడి నీళ్లను వంపేసి వెంటనే బాగా చల్లని నీళ్లలో 2 నుండి 3 నిమిషాలు ఉంచాలి.
తర్వాత నీళ్లను వంపేసి, పాలకూరను బ్లెండర్ జార్ లోకి తీసుకొని, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి ప్యూరీ లా చేసుకోవాలి.
పాలక్ పనీర్ తయారీ విధానం
ముందుగా సోంపు మరియు ఏలకులను కాస్త దోరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పెనంలో వెన్న వేసి కరగనివ్వాలి.
అందులో జీడీ పప్పు వేసి దోరగా వేయించి ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
జీలకర్ర, ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు వేగనివ్వాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్ వేసి కలిపి నూనె అంచులకు చేరే వరకు ఉడికించాలి.
తర్వాత పాలకూర ప్యూరీ, పసుపు, కారం, గరం మసాలా, సోంపు మరియు ఏలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి.
1/4 కప్పు నీళ్లు పోసి 2 నుండి 3 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించి స్టవ్ కట్టేయాలి.
వేయించిన జీడిపప్పు ఇంకా క్రీమ్ లతో గార్నిష్ చేసి వేడిగా వడ్డించాలి.