400గ్రాములుచికెన్ బోన్ లెస్ సన్నని స్ట్రిప్స్ గా కట్ చేసినది
400mlమజ్జిగ
తగినంతఉప్పు
1నిమ్మకాయ
డీప్ ఫ్రై కొరకు
¼కప్పుకార్న్ ఫ్లోర్
నూనె డీప్ ఫ్రై కి సరిపడా
చికెన్ మెజెస్టిక్ కొరకు
2tbspవెల్లుల్లి తరుగు
1రెమ్మ కరివేపాకు
1tbspఅల్లం వెల్లుల్లి పేస్ట్
3పచ్చి మిరపకాయలు
½tspపసుపు
1tbspకారం
1tbspధనియాల పొడి
¼tspగరం మసాలా
1tspసోయా సాస్
1tspవెనిగర్
1/3కప్పుపెరుగు
¼కప్పుఉల్లి కాడ తరుగు
¼కప్పుకొత్తిమీర తరుగు
1నిమ్మకాయ
3tbspనూనె
Instructions
చికెన్ ను మారినేట్ చేయుట
బోన్ లెస్ చికెన్ ను శుభ్రంగా కడిగి సన్నని స్ట్రిప్స్ లా కట్ చేసుకోవాలి.
మజ్జిగలో తగినంత ఉప్పు, నిమ్మ రసం, చికెన్ ముక్కలు వేసి కలిపి గంట లేదా రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి.
డీప్ ఫ్రయింగ్
చికెన్ ముక్కలను ఫ్రిజ్ లో నుండి బయటకు తీసి మజ్జిగ వంపేసి ముక్కలను పక్కన పెట్టుకోవాలి.
ముక్కలకు కొద్దిగా కార్న్ ఫ్లోర్ పట్టించాలి. ఉప్పు వేయక్కరలేదు. మజ్జిగలోని ఉప్పు పీల్చుకున్నాయి కాబట్టి.
కడాయిలో లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేడి చేసి చికెన్ ముక్కలను 2 నిమిషాల పాటు వేయించాలి.
వేయించిన ముక్కలను పేపర్ నాప్ కిన్ లోకి తీసుకోవాలి.
చికెన్ మెజెస్టిక్ తయారీ
ఒక పెనంలో 3 tbsp ల నూనె వేడి చేయాలి.
వెల్లుల్లి తరుగు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, సోయా సాస్, వెనిగర్, పసుపు, కారం ధనియాల పొడి, గరం మసాలా అన్ని ఒక దాని తర్వాత ఒకటి వేసి బాగా కలిపి వేయించాలి.
తర్వాత డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి 3 నుండి 5 నిమిషాల పాటు పెద్ద మంట మీద కలుపుతూ వేయించాలి.
సగం చెక్క నిమ్మ రసం, ఉల్లి కాడల తరుగు, కొత్తిమీర తరుగు వేసి కలిపి వేడిగా సర్వ్ చేయాలి.