ఒక మిక్సింగ్ బౌల్ లోకి చికెన్ ముక్కలు తీసుకొని అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పెరుగు వేసి బాగా కలిపి ఒక గంట పాటు నానబెట్టాలి.
గ్రైన్డింగ్
పండు మిరపకాయలు మరియు టమాటో ను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి స్మూత్ పేస్టు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
పండు మిర్చి చికెన్ ఫ్రై
ఒక పెనంలో నూనె వేడి చేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకో రెండు నిమిషాలు వేయించాలి.
తగినంత ఉప్పు, పసుపు వేసి కలిపి అందులో నానబెట్టుకున్న చికెన్ వేసి బాగా కలపాలి.
మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద చికెన్ పూర్తిగా ఉడికే వరకు ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుతుండాలి.
మూత తెరిచి ఒకసారి కలిపి అందులో కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, పుదీనా ఆకులు వేసి ఒక రెండు నిమిషాలు సిమ్ లో ఉంచాలి.
చివరిగా కొత్తిమీర తరుగు, వేయించిన జీడిపప్పు వేసి స్టవ్ కట్టేయాలి.