క్రీమ్ ను ఒక గిన్నెలోకి తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు విప్ చేయాలి.
అందులోనే స్వీట్ కండెన్స్డ్ మిల్క్ కూడా వేసి ఇంకో రెండు నిమిషాలు విప్ చేయాలి.
తర్వాత మామిడికాయ గుజ్జు వేసి మళ్ళీ రెండు నిమిషాలు బాగా కలిసేలా విప్ చేయాలి.
ఆ మిశ్రమాన్ని ఒక ఫ్రీజర్ సేఫ్ కంటైనర్ లోకి తీసుకొని ఫ్రీజర్ లో 8 నుండి 10 గంటల పాటు ఉంచాలి. ఐస్ క్రీమ్ ఎంత సేపటికి సెట్ అవుతుంది అనేది మీ ఫ్రీజర్ టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది.
ప్రతి 2 గంటలకు ఒకసారి కలుపుతుండాలి.
సర్వ్ చేసే ముందు స్కూప్ ను ఒకసారి మామూలు నీళ్ళలో ముంచి ఐస్ క్రీమ్ ను సర్వింగ్ బౌల్స్ లోకి స్కూప్ అవుట్ చేసుకోవాలి.
పైన కొద్దిగా రోస్ట్ చేసిన నట్స్ తరుగు చల్లి సర్వ్ చేయాలి.