Go Back
Print
Recipe Image
Smaller
Normal
Larger
Print
Crispy Chicken Fries Telugu Recipe
Course
Snack
Cuisine
Global
Prep Time
30
minutes
Cook Time
30
minutes
Total Time
1
hour
Author
బిందు
Ingredients
మారినేషన్ కొరకు
250 నుండి 300
గ్రాములు
బోన్ లెస్ చికెన్
ఉప్పు తగినంత
½
tsp
మిరియాల పొడి
½
చెక్క
నిమ్మకాయ
కోటింగ్ కొరకు
1
కప్పు
బ్రెడ్ క్రంబ్స్
1
కప్పు
మైదా పిండి
2
గుడ్లు బాగా గిలకొట్టినవి
1
tsp
కారం
½
tsp
ఒరేగానో
½
tsp
చిల్లీ ఫ్లేక్స్ (ఆప్షనల్)
వేయించుట కొరకు
నూనె డీప్ ఫ్రై కి సరిపడా
Instructions
చికెన్ ను మారినేట్ చేయుట
చికెన్ ను ఒక జిప్ లాక్ బాగ్ లో కాని ప్లాస్టిక్ కవర్ లో కాని పెట్టి అప్పడాల కర్ర తో ఫ్లాట్ గా అయ్యే వరకు కొడుతూ ఉండాలి.
తర్వాత వాటిని బయటకు తీసి పొడవైన సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
వాటిని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, సగం చెక్క నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
కోటింగ్ చేయుట
రెండు గుడ్లను బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి.
బ్రెడ్ క్రంబ్స్ లో కొద్దిగా ఉప్పు, కారం, మిరియాల పొడి, ఒరేగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలపాలి.
ఒక్కో చికెన్ ముక్కను ముందుగా గుడ్డు సొనలో ముంచి తర్వాత మైదా పిండి లో ముంచి ఆ తర్వాత బ్రెడ్ క్రంబ్స్ లో అటూ ఇటూ తిప్పుతూ కలపాలి.
ఇలా మొత్తం చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
వేయించుట
కడాయి లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడి చేయాలి.
నూనె కాగాక మంటను మీడియం హై ఫ్లేమ్ కు తగ్గించి చికెన్ ముక్కలను మెల్లగా నునేలోకి జారవిడవాలి.
ఒక్క 30 సెకన్లు కదల్చకుండా అలానే ఉంచి తర్వాత మెల్లగా అన్ని వైపులా తిప్పుతూ ౩ నుండి 4 నిమషాల పాటు వేయించి పేపర్ నాప్కిన్ లోకి తీసుకోవాలి.