Go Back
Print
Recipe Image
Smaller
Normal
Larger
Print
Rava Cake Telugu Recipe
Course
Dessert
Cuisine
Global
Prep Time
20
minutes
Cook Time
40
minutes
Total Time
1
hour
Author
బిందు
Ingredients
225
గ్రాములు లేదా 1 ¼ కప్పులు
బొంబాయి రవ్వ
125
గ్రాములు
కరిగించిన బటర్
125
గ్రాములు లేదా 1 కప్పు
పంచదార పొడి
¼
కప్పు లేదా 25 గ్రాములు
కొబ్బరి పొడి
1
tbsp
బేకింగ్ పౌడర్
½
tsp
ఏలకుల పొడి
1
కప్పు లేదా 250 ml
పాలు
చిటికెడు
పసుపు రంగు
¼
కప్పు
నట్స్ తరుగు
Instructions
ఒక మిక్సింగ్ బౌల్ లో కరిగించిన బటర్, పంచదార పొడి వేసి బాగా కలపాలి.
బేకింగ్ పౌడర్, ఏలకుల పొడి, ఎల్లో కలర్ వేసి కలపాలి.
బొంబాయి రవ్వ వేసి మరోసారి కలపాలి.
కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా పోస్తూ కేక్ మిశ్రమాన్ని జారుగా కలపాలి.
కలిపిన మిశ్రమాన్ని 10 నుండి 15 నిమిషాలు నాననివ్వాలి.
తేమనంతా పీల్చుకుని కేక్ మిశ్రమం గట్టిగా తయారవుతుంది.
మళ్ళీ కొద్ది కొద్దిగా పాలు పోస్తూ జారుగా అయ్యే వరకు కలపాలి.
కేక్ టిన్ కు అతుక్కోకుండా బటర్ రాసి కొద్దిగా మైదా పిండి చల్లాలి.
టిన్ లో కేక్ మిశ్రమాన్ని వేయాలి.పైన నట్స్ తరుగు వేయాలి.
ప్రెషర్ కుకర్ లో ఇసుక కానీ, ఉప్పు కానీ వేసి మూత పెట్టి 5 నిమిషాలు వేడి చేయాలి.
మూత తెరిచి కేక్ టిన్ ను ఇసుక మీద ఉంచి గాస్కెట్ తీసేసి కుకర్ మూత పెట్టాలి.
35 నుండి 40 నిమిషాలు బేక్ చేయాలి.లేదా టూత్ పిక్ ను కేక్ లో గుచ్చితే కేక్ మిశ్రమం అంటకుండా వచ్చే వరకు బేక్ చేయాలి.
కేక్ ను పూర్తిగా చల్లారనిచ్చి తర్వాత కట్ చేయాలి.