Go Back
Print
Recipe Image
Smaller
Normal
Larger
Print
Mushroom Pulao Telugu Recipe
Course
Main Course
Cuisine
Hyderabadi, Indian
Prep Time
30
minutes
Cook Time
40
minutes
Total Time
1
hour
10
minutes
Author
బిందు
Ingredients
250
గ్రాములు
బాస్మతి బియ్యం
200
గ్రాములు
పుట్ట గొడుగులు
౩
tbsp
నెయ్యి
౩
tbsp
నూనె
1
మీడియం
ఉల్లిపాయ
2
పచ్చి మిరపకాయలు
1
మీడియం
టమాటో
1
tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్
1 ½
tsp
పులావు మసాల
¼
కప్పు
పుదీనా ఆకులు
¼
కప్పు
కొత్తిమీర
¼
కప్పు
పెరుగు
1
అనాస పువ్వు
4
ఏలకులు
1
జాపత్రి
½
అంగుళం
దాల్చిన చెక్క
4
లవంగాలు
1
బిర్యానీ ఆకు
౩
కప్పులు
నీళ్ళు( బియ్యం కొలవడానికి వాడిన కప్పు తోనే)
ఉప్పు తగినంత
Instructions
బాస్మతి బియ్యాన్ని 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
ఈ లోపు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా తరగాలి.పచ్చిమిరపకాయలు ఇంకా పుట్ట గొడుగుల్ని కూడా కడగాలి.
అరగంట తర్వాత బాస్మతి బియ్యాన్ని రెండు మూడు సార్లు కడగి పక్కన పెట్టుకోవాలి.
ఒక గిన్నెలో 2 tbsp ల నెయ్యి ఇంకా నూనె వేసి వేడి చేయాలి.
నూనె కాగినాక అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, జీడి పప్పు వేసి దోరగా వేయించాలి.
తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు ఉప్పు వేసి ఉల్లిపాయలు మగ్గే వరకు వేయించాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
పలావ్ మసాలా, పెరుగు, తరిగిన పుట్ట గొడుగులు వేసి కలిపి ౩ నుండి 5 నిమిషాలు వేయించాలి.
తగినన్ని నీళ్ళు పోసి ఒకసారి ఉప్పు సరి చూసుకోవాలి.
1 tbsp నెయ్యి, పుదీనా, కొత్తిమీర వేసి నీళ్ళు మరిగే వరకు ఆగాలి.
నీళ్ళు మరగడం మొదలవగానే అందులో నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేయాలి.
బియ్యం వేయగానే నీళ్ళు మరగడం ఆగిపోతుంది. అందుకే మళ్ళీ మరిగే వరకు ఉడికించాలి.
అన్నం ఉడకడం మొదలవగానే ఫ్లేమ్ ను సిమ్ లో ఉంచి అన్నం పూర్తిగా ఉడికే వరకు ఉంచి తర్వాత స్టవ్ కట్టేయాలి.