Go Back
Print
Recipe Image
Smaller
Normal
Larger
Print
Gongura Chicken Recipe - గోంగూర చికెన్
Course
Main Course
Cuisine
Andhra, Hyderabadi
Prep Time
20
minutes
Cook Time
30
minutes
Total Time
50
minutes
Author
బిందు
Ingredients
గోంగూర పేస్ట్ కోసం
150
గ్రాములు
గోంగూర
1
మీడియం
ఉల్లిపాయ
3-4
పచ్చిమిరపకాయలు
¼
కప్పు
వేయించిన జీడిపప్పు
కూర కోసం
600
గ్రాములు
చికెన్
200
గ్రాములు
ఉల్లిపాయ తరుగు
2
పచ్చిమిరపకాయలు
1
రెమ్మ
కరివేపాకు
2
tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్
1
tsp
ఉప్పు
½
tsp
పసుపు
2
tsp
కారం
1
tsp
ధనియాల పొడి
½
tsp
గరం మసాలా
1/3
కప్పు
వేయించిన జీడిపప్పు
5- 6
tbsp
నూనె
Instructions
జీడిపప్పు ని వేయించుట
2 tsp ల నునెని వేడి చేసి అందులో ¼ కప్పు జీడిపప్పు వేసి దోరగా వేయించాలి.
గోంగూర పేస్ట్ తయారీ
కడాయిలో 3 tsp ల నూనె వేడి చేసి అందులో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, గోంగూర వేసి వేయించాలి.
గోంగూర ఆకులు ముడుచుకుపోయి రంగు మారేవరకు వేయించి స్టౌ కట్టేయాలి.
వాటిని కాసేపు ఆరనిచ్చి మిక్సీ లో గోంగూర,వేయించిన జీడిపప్పు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
కూర తయారీ విధానం
ఒక బాణలిలో 5 నుండి 6 tbsp ల నూనె వేడి చేయాలి.
అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు ఉడికించాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
చికెన్ కూడా వేసి, ఒకసారి బాగా కలిపి, మీడియం హీట్ మీద 5 నుండి 7 నిమిషాలు పాటు మూత పెట్టి ఉడికించాలి.
తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
మూత పెట్టి 3 వంతులు ఉడికేవరకు ఉడికించాలి.మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
చికెన్ 3 వంతులు ఉడికిన తర్వాత అందులో గోంగూర పేస్ట్, గరం మసాలా వేసి కలపాలి.
మూత పెట్టి సన్నని సెగ మీద 5 నుండి 7 నిమిషాలు ఉడికించి స్టౌ కట్టేయాలి.