శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
అందులో తగినంత ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, అర చెక్క నిమ్మరసం, పెరుగు వేసి బాగా కలపాలి.
ఈ కలిపిన మిశ్రమాన్ని thigh ముక్కలైతే ఒక గంటసేపు లేదా చెస్ట్ పీస్ లైతే 2 నుండి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి.
పులావు తయారు చేయుట
ముందుగా ఒక అరగంట పాటు బాస్మతి బియ్యాన్ని నానబెట్టాలి.వందే ముందు 2 నుండి 3 సార్లు కడగాలి.
యాలుకలు మరియు సోంపును ఒక నిమిషం పాటు వేపి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాత్రలో నెయ్యి ఇంకా నూనెలను వేసి వేడి చేసాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కొద్దిగా రంగు మారేవరకు వేయించుకోవాలి.
పసుపు, పులావు మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఒకసారి కలపాలి.
తరువాత నీళ్ళు పోసి మరిగే వరకు వేడిచేయాలి.
నీళ్ళు మరగడం మొదలవగానే నానబెట్టి కడిగిన బాస్మతి బియ్యం వేసి అందులో పుదీనా ఆకులు, ముందుగా చేసి పెట్టుకున్న యాలుకలు సోంపు పొడిని వేసి బాగా కలిపి ఒక ఉడుకు రానివ్వాలి.
ఉడకడం మొదలవగానే సిమ్ లోకి తిప్పి మూత పెట్టి అన్నం సరిగ్గా తయారయ్యేవరకు ఉడికించాలి.
టమాటో గుజ్జు తయారీ
రెండు టమాటో లను బాగా కడిగి నిలువు గాట్లు పెట్టాలి.
మరిగే నీటిలో వేసి 2 నుండి 3 నిమిషాలు ఉడికించాలి.
తర్వాత వాటి మీద తొక్క తీసేసి చల్లారాక మిక్సీలో వేసి రుబ్బాలి.
చికెన్ టిక్కా మసాలా తయారీ
ఒక పెనంలో 3 tbsp ల నూనె వేడిచేసి అందులో నానబెట్టుకున్న చికెన్ ను వేయాలి.
బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 7 నుండి 10 నిమిషాల పాటు ఉడికించాలి.మధ్య మధ్యలో కలుపుతుండాలి.
తర్వాత పెనంలో నుండి చికెన్ ముక్కలను వేరు చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పెనంలో ఉన్న గ్రేవీ లో తగినంత ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉడికించిన టొమాటోల గుజ్జు వేసి కలిపి చిక్కబడేవరకు ఉడికించాలి.
ఈలోపుగా ఒక skewer లేదా సీకుకి చికెన్ ముక్కల్ని గుచ్చి గ్యాస్ స్టవ్ మంట మీద అన్ని వైపులా తిప్పుతూ కాల్చాలి.
మరీ మాడ్చినట్లు కాకుండా, కొద్దిగా పొగ వాసన అంటేలా ఇంకా అంచులు కొద్దిగా మాడ్చినట్లుగా కాల్చాలి.
అలా కాల్చిన ముక్కల్ని చిక్కబడిన గ్రేవీ లో వేసి 2 నుండి 3 నిమిషాలు చక్కగా కలుపుతూ ఉడికించాలి.
కొత్తిమీర వేసి దించేసుకోవాలి.
పులావ్ అన్నాన్ని చికెన్ టిక్కా మసాలాని రెండిటిని బాగా కలిపి సర్వ్ చేయాలి.