Go Back
Print
Recipe Image
Smaller
Normal
Larger
Print
షేజ్వాన్ చికెన్ థైస్
Prep Time
30
minutes
Cook Time
20
minutes
Total Time
50
minutes
Servings
2
Author
బిందు
Ingredients
400
గ్రాములు చికెన్ థై పీసెస్
1
tsp
ఉప్పు
10
వెల్లుల్లి రెబ్బలు చిన్నవి
3
tbsp
ఆలివ్ నూనె
1
tbsp
ఆపిల్ సైడర్ వెనిగర్
3
tbsp
షేజువాన్ చట్నీ
½
tsp
తెల్ల నువ్వులు
1
tbsp
కొత్తిమీర తరుగు
Instructions
వెల్లుల్లి రెబ్బల్ని పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి.
చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా పిండి పక్కన పెట్టుకోవాలి.
చికెన్ లో ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ బాగా పట్టేలా కలిపి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
ఒక మందపాటి పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి కాగాక అందులో నానబెట్టిన చికెన్ ముక్కలు వేయాలి.
రెండు వైపులా తిప్పుతూ ఒక 5 నుండి 7 నిముషాల పాటు వేయించాలి.
తరవాత మూత పెట్టి ఒక 5 నుండి 7 నిమిషాల పాటు రెండు వైపులా తిప్పి వేయించాలి.
మూత తెరచి, 1 tbsp ఆపిల్ సైడర్ వెనిగర్ వేయాలి.
తర్వాత 3 నుండి 4 tbsp షేజువాన్ చట్నీ వేసి పెనాన్ని తిప్పుతూ ముక్కల్ని టాస్ చేయాలి.
ఇప్పుడు హై ఫ్లేమ్ మీద వేయించుతూ చికెన్ ముక్కలు చక్కగా రోస్ట్ అయ్యేలా వేయించాలి.
షేజువాన్ గ్రేవీ కొద్దిగా అడుగంటేలా కానీ మాడకుండా వేపి స్టవ్ కట్టేయాలి.
ముక్కల్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని, పెనంలో మిగిలిన షేజువాన్ గ్రేవీ ముక్కల మీద పడేలా పోయాలి.
½ tsp తెల్ల నువ్వులు ముక్కల మీద జల్లి, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి హాట్ గా సర్వ్ చేయాలి.