Go Back
Print
Recipe Image
Smaller
Normal
Larger
Print
Muskmelon Ice Pops- ఖర్బూజా పుల్ల ఐస్
Course
Dessert
Cuisine
Global
Prep Time
15
minutes
Servings
7
Author
bindu
Ingredients
500
గ్రాములు పండిన మస్క్ మెలన్ లేదా ఖర్బూజా ముక్కలు
½
కప్పు పంచదార
½
కప్పు కాచి చల్లార్చిన పాలు
¼
కప్పు దానిమ్మ గింజలు
Instructions
పండిన ఖర్బూజా పండు పైన తోలు తీసేసి చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
జ్యూసర్ జార్ తీసుకొని ఈ ముక్కల్ని అందులో వేసి, అర కప్పు పంచదార, అర కప్పు పాలు పోసి చక్కగా స్మూత్ గా అయ్యే వరకు బ్లెండ్ చేయాలి.
పేపర్ కప్స్ ని గానీ, పుల్ల ఐస్ మౌల్డ్స్ ని గానీ తీసుకొని వాటిలో అడుగున కొన్ని దానిమ్మ గింజలు వేయాలి.
తరవాత వాటిల్లో చిక్కని ఖర్బూజా రసాన్ని పోయాలి.
పేపర్ కప్స్ ని అల్యూమినియం ఫాయిల్ తో గానీ, చిన్న ప్లాస్టిక్ పేపర్ తో గానీ కవర్ చేసి, ఆ వ్రాప్ గుండా టూత్ పిక్ ని గానీ ఐస్ క్రీం పుల్లని గానీ గుచ్చాలి.
తర్వాత పుల్ల ఐస్ మౌల్డ్స్ ని ఫ్రీజర్ లో 8 నుండి 10 గంటల వరకు లేదా రాత్రంతా ఉంచాలి.
తర్వాత రోజు వాటిని బయటకు తీసి ఒక నిమిషం పాటు నీళ్ళ లో ఉంచి బయటకు తీయాలి.