చింతపండును ఒకసారి కడిగి అందులో 500 ml నీళ్ళు పోసి ఒక పావుగంట పాటు నానబెట్టాలి.
తర్వాత ఒక జల్లెడ సహాయంతో రసం నుండి పిప్పిని వేరు చేసి పక్కన పెట్టుకోవాలి.
పప్పు తయారు చేయుట
పచ్చిశనగపప్పును ఒకటి రెండు సార్లు కడిగి ప్రెషర్ కుకర్ లో వేసి అంతకు పప్పు పరిమాణానికి నాలుగింతలు నీళ్ళు పోసి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ కట్టేయాలి.
ఆవిరి పూర్తిగా పోయే వరకు మూత తెరవకూడదు.
తర్వాత మూత తెరచి పప్పును మెత్తగా పేస్టులా చేసుకోవాలి.
మటన్ కర్రీ వండు విధానం
ఒక ప్రెషర్ పాన్ లో నూనె పోసి వేడి చేయాలి.
నూనె కాగాక, 3 లవంగాలు, 2 యాలుకలు, ½ అంగుళం దాల్చిన చెక్క వేయాలి.
తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి మెత్తబడే వరకు వేయించాలి.
శుభ్రంగా కడిగిన మటన్ ముక్కలను వేసి కలిపి 5 నుండి 7 నిమిషాలు ఉడికించాలి.
అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి ఇంకో రెండు నిమిషాలు ఉడికించాలి.
పసుపు, కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలిపి 5 నిమిషాలు మీడియం సెగ మీద వేయించాలి.
తర్వాత 2 కప్పులు నీళ్ళు పోసి, షాజీరా ఇంకా పుదినా వేసి మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
ఆవిరంతా పోయే వరకు వదిలేసి తర్వాత మూత తెరవాలి.
మటన్ దాల్చా వండే విధానం
ఒక గిన్నెలో నూనె వేడి చేసి, అందులో ఉల్లిపాయలు, పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, క్యారెట్ ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి.తరిగిన టమాటో వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించాలి.
చింతపండు రసం, ఉడికించి పెట్టుకున్న పప్పు, పుదీనా, షాజీరా, సోంపు వేసి మరిగించాలి.
మరగడం మొదలవగానే ముందే వండిన మటన్ కూర వేసి కలిపి నూనె అంచులకు తేలేవరకు ఉడికించాలి.