ఉప్పు, పసుపు కలిపిన మజ్జిగలో ఒక 5 నిమిషాల పాటు చేప ముక్కలను నానబెట్టాలి.ఇలా చేయడం వల్ల నీచు వాసన తొలగిపోతుంది.
చేప ముక్కలలో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, నిమ్మరసం వేసి బాగా పట్టించి ఒక 15 నుండి 20 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి.
తర్వాత ఒక పెనం లో నూనె వేడి చేసి అందులో చేప ముక్కలను జాగ్రత్తగా వేయాలి.
ఒక్కొక్క వైపు 10 నుండి 12 నిమిషాల పాటు మధ్య మధ్యలో తిప్పుతూ వేయించాలి.
అన్నీ వేయించడం అయిపోయాక స్టవ్ కట్టేసి కొత్తిమీర మరియు ఉల్లికాడల తరగు ముక్కలపై వేసి సర్వ్ చేయాలి.