Chicken Biryani recipe made with Horse gram soup or Ulavacharu or Kollu rasam
Course
Main Course
Cuisine
Andhra, Hyderabadi, Indian
Prep Time30minutes
Cook Time30minutes
Total Time1hour
Servings4
Authorబిందు
Ingredients
మసాలా కోసం
5యాలుకలు
5లవంగాలు
3దాల్చినచెక్క అంగుళం పొడవు
1జాపత్రి
¼ముక్క జాజికాయ
2మరాఠి మొగ్గలు
1tbspబిర్యానీ పూలు
1అనాస పువ్వు
1tbspసోంపు
1tbspషాజీర
మారినేషన్ కోసం
1kgచికెన్
500గ్రాములుపెరుగు
2tbspఅల్లం వెల్లుల్లి పేస్టు
½tspపసుపు
2 లేదా 3tbspకారం
ఉప్పు తగినంత
3 లేదా 4tspబిర్యానీ మసాలా
3 లేదా 4పచ్చిమిరపకాయలు
½కప్పుకొత్తిమీర
½కప్పుపుదీనా
40 లేదా 50గ్రాములువేయించిన ఉల్లిపాయలు
1నిమ్మకాయ
2tbspనెయ్యి
60mlనూనె
అన్నం ఉడికించుట కొరకు
600గ్రాములుబాస్మతి రైస్
3లీటర్లునీళ్ళు
అన్ని గరం మసాలా దినుసులు కలిపి కొద్దిగా
ఉప్పు తగినంత
2tbspనూనె
¼కప్పుపుదీనా
ఉలవచారు బిర్యానీ కొరకు
250mlలేదా 300 ml ఉలవచారు
½కప్పుపుదీనా
10గ్రాములువేయించిన ఉల్లిపాయలు
1tbspనెయ్యి
Instructions
బిర్యానీ మసాలా తయారు చేయుట
ఒక చిన్న పెనంలో ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, బిర్యానీ పూలు, షాజీర, సోంపు, మరాఠీ మొగ్గ వేసి దోరగా వేయించి మిక్సీలో మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
చికెన్ ను మారినేట్ చేయుట
ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ లో పసుపు, కారం, ఉప్పు, బిర్యానీ మసాలా కలపాలి.
పెరుగు, నూనె, నెయ్యి వేసి మళ్ళీ కలపాలి.
తర్వాత పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, పుదీనా , వేయించిన ఉల్లిపాయలు వేసి, నిమ్మకాయ రసం కూడా పిండాలి.
కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కలను కూడా వేసి మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలా కలిపి ఒక గంట పాటు నానబెట్టాలి.
నానబెట్టుట
600 గ్రాములు బియ్యం గిన్నెలోకి తీసుకొని నీళ్ళు పోసి అరగంట సేపు నానబెట్టాలి.
వండే ముందు రెండు మూడు సార్లు కడిగి వాడాలి.
చికెన్ ను వండుట
బిర్యానీ వండాలనుకున్న గిన్నెలో అడుగున కొద్దిగా నూనె పోసి మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ను వేయాలి.
ఆ గిన్నెను అల్యూమినియం ఫాయిల్ తో సరిగ్గా మూయాలి.పైన మూత కూడా పెట్టి 15 నిమిషాలు పెద్ద మంట మీద ఉడికించాలి.
తర్వాత పొయ్యి సిమ్ లో పెట్టాలి.
*అన్నాన్ని చికెన్ ను ఒకే సమయంలో వేరు వేరుగా సగం ఉడికేలా వండాలి*
అన్నం వండుట
ఒక మందపాటి పాత్రలో సుమారు 3 లీటర్ల నీళ్ళు పోయాలి.
ఆ నీళ్ళలో అన్ని గరం మసాలా దినుసులు, పుదీనా ఆకులు, ఉప్పు, నూనె వేసి మరిగే వరకు కాగనివ్వాలి.
నీళ్ళు మరగడం మొదలవ గానే అందులో నానబెట్టిన బియ్యం వేయాలి.
బియ్యం వేయగానే నీళ్ళు మరగడం ఆగిపోతుంది అందుకే మళ్ళీ ఒక ఉడుకు వచ్చే వరకు వండాలి.
ఉడకడం మొదలైన దగ్గర నుండి ఒక 3 నిమిషాల పాటు ఉంచి తర్వాత స్టవ్ కట్టేసి వెంటనే నీటిని వార్చేయాలి.
అన్నాన్ని మరియు చికెన్ ను కలిపి వండుట
ఇంతకుముందు చికెన్ మీద పెట్టుకున్న అల్యూమినియం ఫాయిల్ ను జాగ్రత్తగా తీసి పక్కన పెట్టి సన్నటి సెగ మీద ఉడుకుతున్న కూరను ఒకసారి కలిపి అందులో ఉలవచారు కూడా వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి.
తర్వాత ఉలవచారు చికెన్ మీద సగం ఉడికిన అన్నం వేసి సమంగా పరచుకునేట్లుగా సర్దాలి.
అన్నం మీద కొన్ని పుదీనా ఆకులు, వేయించిన ఉల్లిపాయలు వేయాలి.
ఆ పాత్రను మళ్ళీ అల్యూమినియం ఫాయిల్ తో మూసి మూత కూడా పెట్టి సిమ్ లో 15 నిమిషాలు ఉడికించి స్టవ్ కట్టేయాలి.
స్టవ్ కట్టేయగానే మూత తెరవకుండా ఒక 15 నుండి 30 నిమిషాల పాటు వదిలేసి ఆ తర్వాత వడ్డించాలి.