సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, సగ్గుబియ్యం ఒక అంగుళం పైన వరకు నీళ్ళు పోయాలి.
హై ఫ్లేం మీద పెట్టి ఒక మరుగు వచ్చే వరకు ఉడికించాలి.
ఉడకడం మొదలవగానే ఫ్లేమ్ ను మీడియం లోకి తిప్పి సగ్గుబియ్యం బయటి పొర పారదర్శకంగా(transparent) అయ్యేవరకు కలుపుతూ ఉడికించాలి.కలపకపోతే సగ్గుబియ్యం అడుగంటే ప్రమాదం ఉంది.
తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సగ్గుబియ్యం పక్కన పెట్టుకోవాలి.
బెల్లం పానకం తయారీ
బెల్లం తురుము ను ఒక మందపాటి గిన్నెలోకి తీసుకొని అందులో నీళ్ళు పోయాలి.
పెద్ద మంట మీద ఉంచి మరిగే వరకు ఉడికించాలి.
ఒక సారి ఉడకడం మొదలవగానే తిప్పుతూ ఉండాలి.
తీగ పాకం అవసరం లేదు.పాకాన్ని పట్టుకుంటే జిడ్డుగా నునెలా అనిపించే వరకు కాచి స్టవ్ కట్టేసి పాకాన్ని పక్కన పెట్టుకోవాలి.
పప్పుల పొడి తయారీ
బాదంపప్పు, జీడిపప్పు మరియు ఏలకులను మిక్సీలో వేసి పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి.
సగ్గుబియ్యం పాయసం తయారీ
మందపాటి పాత్రలో పాలు పోసి మరిగే వరకు కాచాలి.
పాలు మరగడం మొదలవగానే అందులో ఉడికించిన సగ్గుబియ్యం వేసి 3 నిమిషాల పాటు కాయాలి.
తర్వాత స్వీట్ కన్దేన్స్ డ్ మిల్క్, పప్పుల పొడి వేసి కలిపి 3 నుండి 5 నిమిషాల పాటు సన్నని సెగ మీద కలుపుతూ కాయాలి.
స్టవ్ కట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచాలి.తర్వాత పాయసం లో బెల్లం పాకం పోసి కలపాలి.
సర్వింగ్
ఒక చిన్న పెనంలో నెయ్యి వేసి అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదంపప్పు లను దోరగా వేయించి పాయసంలో వేసి వేడిగా గానీ లేదా రెండు నుండి మూడు గంటలు ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సర్వ్ చేయవచ్చు.