Go Back
Print
Recipe Image
Smaller
Normal
Larger
Print
Dry Fruit Bobbatlu Telugu Recipe
Course
Dessert, Snack
Cuisine
Andhra, Hyderabadi, South Indian
Prep Time
15
minutes
Cook Time
1
hour
Total Time
1
hour
15
minutes
Author
బిందు
Ingredients
పిండి కొరకు
250
మైదా పిండి లేదా గోధుమ పిండి
1/8
కప్పు
బొంబాయి రవ్వ
చిటికెడు ఉప్పు
2
tbsp
నూనె
నీళ్ళు తగినంత
మిక్స్చర్ కొరకు
1
కప్పు
లేదా 200 గ్రాములు పచ్చిశనగపప్పు
200
బెల్లం తురుము
200
ml
నీళ్లు (పాకం కోసం)
15
బాదంపప్పులు
15
పిస్తాపప్పులు
15
జీడిపప్పులు
¼
కప్పు
పల్లీలు వేయించి పొట్టు తీసినవి
¼
కప్పు
ఎండు కొబ్బరి పొడి(ఆప్షనల్)
3
ఏలకులు
బొబ్బట్ల కోసం
1
ప్లాస్టిక్ షీట్
¼
కప్పు
నెయ్యి
Instructions
పిండి కొరకు
మైదా పిండి లేదా గోధుమ పిండిని గిన్నెలోకి తీసుకోవాలి.
అందులో చిటికెడు ఉప్పు, నూనె, కొద్దిగా బొంబాయి రవ్వ వేసి ఒకసారి కలపాలి.
తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ మెత్తగా చపాతి పిండిలా కలుపుకోవాలి.
పైన తేమ కోల్పోకుండా కొద్దిగా నూనె రాసి మూత ఉంచి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
పప్పును ఉడికించుట
పప్పు ని శుభ్రంగా కడిగి అంగుళం పైన వరకు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఒక మరుగు వచ్చే వరకు ఉడికించాలి.
పప్పు అదే షేప్ లో ఉండాలి కానీ పూర్తిగా ఉడకాలి.మెత్తగా పేస్ట్ లా కాకుండా చూసుకోవాలి.
ఉడకగానే స్టవ్ కట్టేసి నీళ్ళు వార్చేసి పప్పును పక్కన పెట్టుకోవాలి.
పొడి కొట్టుట
జీడి పప్పు, బాదం పప్పు,పల్లీ మరియు పిస్తాపప్పు లను దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి కొట్టాలి.
ఉడికించి పెట్టుకున్న పచ్చి సెనగ పప్పును కూడా మిక్సీలో వేసి పొడి కొట్టాలి.
ఏలకులను కూడా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
అన్ని పొడులను ఒకే గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి.
మిక్స్చర్ తయారు చేయుట
ఒక బాణలిలో బెల్లం తురుము, నీళ్ళు పోసి మరిగే వరకు ఉడికించాలి.
మరగడం మొదలవగానే, పైన తయారు చెసి పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి.
మిశ్రమం గట్టిగా ముద్దలా అవగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
బొబ్బట్లు తయారీ
ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకోవాలి.
ఒక్కో ఉండను మైదా లేదా గోధుమ పిండి మధ్యలో ఉంచి చపాతీ లా ఒత్తుకోవాలి.
పెనంలో 2 tsp ల నెయ్యి వేసి బొబ్బట్లను రెండు వైపులా సమంగా కాల్చుకోవాలి.
కాల్చడం పూర్తవగానే బొబ్బట్టుని ప్లేట్ లోకి తీసుకొని మళ్ళీ పైన కొద్దిగా నెయ్యి రాయాలి